7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో జీతభత్యాలు పెరగనున్నాయి. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ మరోసారి పెంచేందుకు సర్వం సిద్ధమౌతోంది. డీఏ ఈసారి 42 శాతానికి చేరుకోవచ్చని తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
7th Pay Commission Updates Central Government Employees Da May Hike By 4 Percent In Next Coming Month March Union Cabinet To Take Decision
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. అతి త్వరలో ప్రభుత్వం డీఏ పెంపు నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. ఇటీవల 34 నుంచి 38 శాతానికి డీఏను పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈసారి మరో 4 శాతం పెంచడం ద్వారా 42 శాతం చేయవచ్చు.
7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది మరోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెరగనుంది. కరోనా మహమ్మారి సమయంలో తప్ప ప్రతిసారీ డీఏ పెంపు నిర్విరామంగా కొనసాగుతోంది. కరోనా మహమ్మారి అనంతరం గత ఏడాది సెప్టెంబర్ నెలాఖరులో డీఏను 4 శాతం పెంచడం ద్వారా 38 శాతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా కరవుభత్యం పెరగనుంది. మార్చ్ 1వ తేదీన జరగనున్న మోదీ కేబినెట్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.
4 శాతం పెరగనున్న డీఏ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అనేది నిత్యావసర వస్తు ధరల పెంపుపై ఆధారపడి ఉంటుంది. అంటే నిత్యావసర ధరలు ఎంతగా పెరిగితే డీఏ అంత పెరుగుతుంటుంది. దీనికోసం సీపీఐ-ఐ డబ్ల్యు సూచిక ఉంది. సీపీఐ-ఐడబ్ల్యూ సూచిక గణాంకాల ప్రకారం ఈసారి డీఏ దాదాపు 4.23 శాతం పెరగాల్సి ఉంది. డీఏలో 4 శాతం పెరుగుదల ఉండవచ్చని సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 38 శాతం నుంచి 42 శాతం పెరగనుంది.
7500 రూపాయలు పెరగనుందా..??
పెరిగిన డీఏను జనవరి నుంచి అమలు చేయవచ్చు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన డీఏను ఎరియర్ల రూపంలో అందిస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలల డీఏ ఎరియర్లను మార్చ్‌లో అందిస్తారు. డీఏ అనేది ఏడాదిలో రెండుసార్లు పెరుగుతుంటుంది. అంటే ప్రతియేటా జనవరి, జూలై నెలల్లో డీఏ సమీక్షించి పెంచుతుంది. ఒకవేళ ప్రభుత్వం 4 శాతం చొప్పున డీఏ పెంచితే..ఉద్యోగుల జీతం 18 వేలుంటే..7560 రూపాయలు కరవు భత్యం పెరగనుంది.
Leave a Reply