విశాఖపట్నంలో 3 లక్షల చదరపు అడుగులతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
పారిశ్రామికవేత్తలను చేయిపట్టుకుని | నడిపించేలా విధానం ఉండాలి | సమీక్షలో అధికారులకు సీఎం జగన్ ఆదేశం
A new building for startups in Visakhapatnam
విశాఖపట్నంలో 3 లక్షల చదరపు అడుగులతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అదే భవనంలో పరిశ్రమలశాఖ కార్యాలయం ఉండాలన్నారు. నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై తాడేపల్లిలో ఆ శాఖ అధికారులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. పలు కీలక సూచనలు చేశారు. ‘‘పరిశ్రమలను స్థాపించినప్పటి నుంచి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే వరకు పారిశ్రామికవేత్తలను చేయిపట్టుకుని నడిపించేలా విధానం ఉండాలి.
మార్కెటింగ్ వ్యవస్థను పరిశ్రమలకు ఎలా అనుసంధానం చేయాలనే దానిపై దృష్టి సారించాలి. అంతర్జాతీయ మార్కెటింగ్ వ్యవస్థను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) అనుసంధానం చేస్తే మరింత మెరుగైన అభివృద్ధి సాధించడం సాధ్యం అవుతుంది. ఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పోర్టు ఆధారిత పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి.
ఎంఎస్‌ఎంఈలకు ‘సూచనలు.. సహాయం.. సహకారం’ అందించేలా విధానం ఉండాలి’’ అని పేర్కొన్నారు. ఈ అంశాల ప్రాతిపదికగా కొత్త పారిశ్రామిక విధానంలో ప్రతిపాదనలు ఉండాలన్నారు.
Leave a Reply