హాయ్ ఫ్రెండ్స్ navaratnalu.com కు స్వాగతం, ఈ పోస్టు ద్వారా జగనన్న అమ్మ ఒడి పథకం లో వచ్చిన కొత్త మార్పులను తెలుసుకుందాం. జగనన్న అమ్మ వాడి పథకం నాలుగో విడత డబ్బులు జనవరి నెలలో అందజేస్తామని ప్రభుత్వం ఇదివరకే చెప్పింది. మరి ఇప్పుడు అయితే కొత్త రూల్స్ అయితే తీసుకుని వచ్చింది అవేంటో తెలుసుకుందాం.
జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో విడత డబ్బులు మంజూరు చేయడానికి మార్చి నెల వరకు అయితే ఆగాలి అని అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విద్యార్థి మార్చి వరకు ఉన్న పాఠశాల హాజరు ఆధారంగా 75% హాజరు శాతం ఉంటేనే డబ్బులు మంజూరు చేస్తారు అనేది కొత్త నియమం. ఈ నియమం రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూల్ల లోని విద్యార్థులకు వర్తిస్తుంది.
కాబట్టి మార్చి వరకు ఉన్న విద్యార్థుల హాజరు ఆధారంగా ఎవరికైతే 75% కన్నా ఎక్కువ హాజరు శాతం ఉందో వాళ్ల పేర్లు ఫైనల్స్లో చేర్చబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ వడి పథకానికి అర్హులైన విద్యార్థులందరికీ హాజరును ఆధారంగా తీసుకుని ఎవరికైతే 75% లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వారిని మాత్రమే Final List లో చేర్చి వారికి మాత్రమే ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
కాబట్టి ఈ సందర్భంగా జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో విడత డబ్బులు జనవరిలో కాకుండా మార్చి నెలలో వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే అమ్మ ఒడి పథకం అర్హులు ఉన్నారు మీరు నవరత్నాలు డాట్ కామ్ వెబ్ సైట్ తో అప్డేట్ లో ఉండండి. ఎందుకంటే ఈ లోపు ప్రభుత్వం అమ్మఒడి పథకం మీద ఏవైనా మార్పులు చేస్తే వెంటనే ఇక్కడ ఈ పేజీలో అప్డేట్ చేస్తాము.
అమ్మ వాడి పథకం కొత్త నియమాలు ఇవే
గవర్నమెంట్ ఉద్యోగులు మరియు ఇన్కమ్ టాక్స్ కట్టేవారు అనర్హులు
బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో ఉండాలి
ఆధార్ కార్డ్ కి ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉండాలి
బ్యాంక్ – ఆధార్ NPCI లింక్ ఉండాలి
ఐదు సంవత్సరాలు ఆపై వయస్సు ఉన్న విద్యార్థులందరూ ఈ కేవైసీ తప్పనిసరి
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి
కరెంట్ బిల్లు 300 యూనిట్లు లోపు ఉండాలి
75% హాజరు కలిగి ఉండాలి (నవంబర్ 8 నుండి ఏప్రిల్ 30 వరకు) – 2022-23
కొత్త రైస్ కార్డ్ కలిగిఉండాలి
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply