అనంతపురం (Anantapuram) నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు గల చంద్ర హాస్పిటల్ వద్ద స్పందన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ఈ ట్రస్టు వారు ఐదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
ANANTAPURAM SPANDANA TRUST GIVING FOOD FOR RUPEES 5 TO POOR PEOPLE IN ANANTAPURAM FULL DETAILS
అనంతపురం (Anantapuram) నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు గల చంద్ర హాస్పిటల్ వద్ద స్పందన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ఈ ట్రస్టు వారు ఐదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. నిత్యం నగరంలో ఎంతోమంది ఇక్కడ ప్రతిరోజు వారి ఆకలి తీరుస్తోంది స్పందన ట్రస్ట్, నిత్యం ఎక్కువ రద్దీగల ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేయడంతో అక్కడే ఫ్రూట్స్ అమ్ముకునే తోపుడు బండి వారు, కార్మికులు, కూలీలు, ఆస్పత్రికి వచ్చే రోగులు, రోగి బంధువులు ఇలా చాలామంది నిత్యం వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారు. నిజంగా ఇలాంటి వారికి ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
ఈ స్పందన ట్రస్ట్ వారు ఉదయం పూట రెండు రూపాయలకే ఇడ్లీ కూడా అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులలో కడుపునిండా భోజనం దొరకాలంటే వంద రూపాయలకి తక్కువ ఎక్కడా కూడా దొరకదు. అది కూడా నాణ్యత అంతగా బాగుంటుందని చెప్పలేం.
ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైనఆహారం మరియు సాంబారు పప్పు లాంటి వాటితో నిత్యం ప్రతిరోజు ఇక్కడ ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ఈ ఐదు రూపాయలు భోజనం సదుపాయమే కాకుండా ఒంటరి వారిని మరియు స్కూల్ సంబంధించిన అనాథ పిల్లలకు తగినంత సహాయం, ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారని నిర్వాహకులు తెలిపారు.
నిజంగా ఐదు రూపాయలు భోజన సదుపాయం అనేది అద్భుతంగా నగరవాసులకు ఉపయోగపడుతోంద. ఈ ఐదు రూపాయల భోజనం కార్యక్రమం వల్ల ఎంతోమందికి కడుపు నింపుతోంది ప్రతిరోజు.