విజయవాడ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
ఈ ప్రమాదంపై విచారణ జరపాలని సూచించారు.
ఈ ఘటన విచారకరమని.. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌కు అధికారులు వివరాలను అందించారు.
విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లింది.. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
పలువురు గాయపడగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆర్టీసీ కూడా చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.
గాయపడినవారి వైద్య ఖర్చులు భరిస్తామని తెలిపారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని.. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.
Leave a Reply