హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కం టు navaratnalu.com. ఏపీలో లో డ్వాక్రా రుణమాఫీ మూడో విడత నిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కావున డ్వాక్రా రుణమాఫీ మూడో విడత నిధులకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్ లో చదివి తెలుసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి.
డ్వాక్రా రుణమాఫీ మూడో విడతలో భాగంగా రేపు అర్హుల ఖాతాల్లో 12,500 జమ. డ్వాక్రా రుణమాఫీ కి సంబంధించి 2019 ఏప్రిల్ వరకు ఉన్న రుణాలను నాలుగు విడతలలో రుణమాఫీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఇందులో భాగంగా ఇదివరకే రెండు విడతల రుణ మాఫీ చేయడం జరిగింది. మూడో విడత డ్వాక్రా రుణమాఫీ కి సంబంధించి ఎప్పుడు రుణ మాఫీ చేస్తారు అని ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే 2019 ఏప్రిల్ నెలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన నేపథ్యంలో 2020 జనవరి నెల మొదటి విడత డ్వాక్రా రుణమాఫీ చేయడం జరిగింది, అలాగే 2022 జనవరి నెలలో రెండో విడత డ్వాక్రా రుణమాఫీ చేయడం జరిగింది. ఇక మూడో విడత రుణమాఫీ కి సంబంధించి జనవరి నెల 2023 లో చేయవలసి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఈ జనవరి నెలలో రుణమాఫీ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది.
ఇక 2023 సంబంధించి డ్వాక్రా రుణమాఫీ ఫిబ్రవరి రెండో వారంలో చేస్తామని అప్డేట్స్ వస్తున్నాయి. ఈ dwakra రుణమాఫీ కి సంబంధించి అర్హులైన డ్వాక్రా రుణమాఫీ మహిళల ఖాతాలో రూ.12,500 జమ అవుతూ ఉంటాయి. అయితే ఐదు లక్షల వరకు లోన్ ఉన్న వారికి 12,500 రూపాయలు జమ చేస్తారు, ఇక నాలుగు లక్షల రుణం ఉన్న ఉన్నటువంటి డ్వాక్రా మహిళల గ్రూపులో ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున జమ చేస్తూ ఉంటారు.
కాబట్టి డ్వాక్రా రుణమాఫీ మూడో విడత ప్రక్రియ స్టార్ట్ అయింది, అర్హత కలిగిన డ్వాక్రా మహిళల దగ్గరనుంచి ఆల్రెడీ బయోమెట్రిక్ వివరాలను సేకరించారు. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ యొక్క గ్రామాల / వార్డు సచివాలయానికి వెళ్లి పేరు ఈ లిస్టు లో ఉందో లేదో చెక్ చేసుకోండి.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply