Earthquake: ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, కంచికర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాలతో పాటు పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో స్వల్ప భూకంపం వచ్చింది.
Vijayawada Earthquake Tremors Felt in Palnadu And NTR Districts In Andhra Pradesh
ఏపీలో పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం (Earthquake) వణికించింది. ఎన్టీఆర్ (NTR), పల్నాడు (Palnadu) జిల్లాలో భూప్రకంపనలు (Earth tremors) నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, కంచికర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాలతో పాటు పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. పులిచింత ప్రాజెక్టు పరిసరాల్లో కూడా భూమి కంపించింది. భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఐతే ఎంత తీవ్రతతో ఈ భూప్రకంపనలు వచ్చాయన్న వివరాలు తెలియాల్సి ఉంది.
Leave a Reply