AP Grama Volunteer Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్ల రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రకటన విడుదలైంది.
ప్రధానాంశాలు:
- ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్
- నెల్లూరు జిల్లాలో ఖాళీల భర్తీకి ప్రకటన
- నవంబర్ 9 దరఖాస్తులకు చివరితేది
AP Grama Ward Volunteer Jobs : ఆంధ్రప్రదేశ్- నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న వలంటీర్ పోస్టుల భర్తీకి సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లాలో 147 వలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఉన్న ఖాళీలను దృష్టిలో పెట్టుకుని భర్తీ చేస్తామని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులై వారు అర్హులని తెలిపారు. నవంబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తారు. నవంబర్ 9వ తేదీన దరఖాస్తుల పరిశీలన.. 10వ తేదీన ఇంటర్వ్యూల నిర్వహణ పూర్తి చేసి ఎంపికైన వారికి 13వ తేదీన నియామక పత్రాలు అందజేయాలని అధికారులు నిర్ణయించారు.
Leave a Reply