ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ లలో మార్చి 10 నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావా అందించనున్నారు.
మార్చి 18న జగనన్న విద్యా దీవెన మార్చి 23న జగనన్నకు చెబుదాం ప్రారంభించనున్నారు.
ఉగాదికి ఉత్తమ వాలంటీర్లను ప్రకటించి ఏప్రిల్ 10న సన్మానించనున్నారు.
ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ పూర్తిస్థాయిలో అమలుకి సిద్ధం అవుతుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ త్వరలో ముగియ నున్నడంతో కొద్ది రోజులుగా నిలిచిపోయిన పథకాలు కార్యక్రమాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మంగళవారం తన కార్యాలయాధికారులతో సమావేశమైన సీఎం జగన్ మార్చి ఏప్రిల్ నెలలో చేపట్టవలసిన కార్యక్రమాలు పథకాలపై చర్చించి అమలు తేదీని ఖరారు చేశారు. పిల్లలలో ఐరన్ మరియు కాల్షియం లోపాల నివారించే లక్ష్యంతో మధ్యాహ్నం భోజన పథకం ఎన్నుయులో రాగి జావా ని చేర్చారు. ఎన్నికల కోడ్ తో సంబంధం లేనందున మార్చి 10వ తేదీ నుండి మధ్యాహ్న భోజనంలో రాగి జావా అమలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా కొద్దిగా ఆలస్యమైన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని ఏప్రిల్ 6 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ట్రయల్ రన్ ఇప్పటికే మొదలైంది. మార్చి 14 నుంచి అసెంబ్లీ సమావేశాల పైన డీఎస్సీ BSC సమావేశం లో చర్చించి, సమావేశాల షెడ్యూల్ నే కరారు చేయనున్నారు.
మార్చి అండ్ ఏప్రిల్ స్కీమ్ లు
మార్చి 18 న సంపూర్ణ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు.
జగనన్న విద్యాదీవెన లబ్దిదారుల ఖాతాల్లోకి డిబీటి పద్ధతిలో నగదు జమ.
మార్చి 22 న ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన.
ఏప్రిల్ 10 న అవార్డులు , రివార్డులు ప్రదానం.
మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం.
మార్చి 25 నుంచి వైఎస్ఆర్ ఆసరా.
ఏప్రిల్ 5 వరకు కొనసాగనున్న కార్యక్రమం.
మార్చి 31న జగనన్న వసతి దీవెన.
ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తిస్థాయిలో అమలు.
ఏప్రిల్ 18న ఈబీసీ నేస్తం.
ఏప్రిల్ 10న ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు సన్మానం.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply