ఆరోగ్యశ్రీ (నవరత్నాలు) : వార్షిక ఆదాయం రూ.5,00,000 దాటని అన్ని వర్గాల వారికీ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపు. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు.
ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ ద్వారానే ఉచిత వైద్యం అందిస్తారు.
హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైతో పాటు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లను దీని పరిధిలోకి వస్తాయి.ఆపరేషన్ చేయించుకున్న లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక చేయూతనందిస్తారు.
కిడ్నీవ్యాధి, తలసేమియాతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తారు.
అందరికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ – Jagan Navaratnalu
వార్షిక ఆదాయం రూ. 5,00,000 దాటని అన్ని వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపు.
వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.
ఎన్ని లక్షలు ఖర్చాయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం.
ఎక్కడ చికిత్స చేయించుకున్నా (హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై మొదలగున్నవి) ఆరోగ్యశ్రీ వర్తింపు.
అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి.
ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా ఆర్ధిక సహాయం.
కిడ్నీ వ్యాధి, తలసేమియా ఇంకా ఇటువంటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్ నెల నెలా ఇస్తాం.
ఆరోగ్యశ్రీ సేవలు ఇంకా మెరుగ్గా పకడ్బందీగా అందిస్తూనే మరోవైపు రెండేళ్లలోగా కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రుల ముఖచిత్రాలు (ఫోటోలు) మీముందుంచుతాం. రెండేళ్ళ తర్వాత ఆ ఆసుపత్రి దశ దిశ మార్చి మారిన ముఖచిత్రాలు మీ ముందుంచుతాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్య అవసరమైన మేరకు పూర్తిగా పెంచుతాం.
ఆరోగ్యశ్రీ సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply