హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవరత్నాలు డాట్ కాం వెబ్ ఈ వెబ్ పేజీ ద్వారా ఆధార్ ధ్రువీకరణ సమయంలో లబ్దిదారుడి అనుమతి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది ఎందుకో డీటెయిల్ గా చదవండి.
దిల్లీ: ఏదైనా పని కోసం ఆధార్ (ధ్రువీకరణ(అథెంటికేషన్) చేసే ముందు పేపర్ మీద కానీ, ఎలక్ట్రానిక్ రూపంలో కానీ తప్పనిసరిగా వినియోగదారుడి అనుమతి తీసుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార నంస్థ(యూఐడీఏఐ) – UIDAI తెలిపింది. ఆధార్ వివరాలు స్వీకరించే సంస్థలు పాటించాల్సిన మార్గదర్శకాలను సూచిస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
వినియోగదారుడి వివరాలు తీసుకొనే సంస్థలు (రిక్వెస్టింగ్ ఎంటిటీస్) ఆన్‌లైన్ ధ్రువీకరణ చేసే ముందు అందుకోసం ఏయే వివరాలు సేకరిస్తున్నదీ వినియోగదారులకు అర్ధమ య్యేలా వివరించాలని పేర్కొంది. ఆధార్ అథెంటికేషన్‌కు సంబంధించిన లావాదేవీల వివరాలు, వినియోగదారుల నుంచి తీసుకున్న అనుమతి పత్రాలను నిర్దిష్ట గడువు వరకు ప్రత్యేకంగా నిక్షిప్తం చేయాలని సూచించింది. ఆ గడువు తర్వాత వాటిని ఆధార్ చట్టం పేర్కొన్న నిబంధనల ప్రకారమే ప్రక్షాళన చేయాలని పేర్కొంది.
ఆధార్ వివరాలను తీసుకొనే సంస్థలు వినియో గదారులతో మర్యాదతో వ్యవహరించాలని, అలాగే వారి ఆధార్ నంబరు గోప్యతకు ఇబ్బంది ఉండదని భరోసా ఇవ్వాలని తెలిపింది.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply