తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో బీజేపీ పార్టీ ( BJP party ) దూకుడు పెంచింది.
ఈ ఎన్నికల్లో అగ్ర నాయకుల చరిష్మాను వాడుకునేందుకు పావులు కదుపుతోంది. ప్రణాళికలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో 5 నుంచి 10 సభలు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా , నడ్దాల 15కు పైగా సభలు ఉండేలా చూస్తున్నారు. ప్రచారం కోసం నాలుగు హెలికాప్టర్లను బీజేపీ పార్టీ కిరాయికి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27, 28, 29, 31 తేదీల్లో బీజేపీ అగ్ర నేతల విస్తృత ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో యడ్యూరప్ప, దేవేంద్ర ఫడ్నవిస్, అర్జున్ ముండా, చిరాగ్ పాశ్వాన్, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు తెలంగాణ రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో పర్యటించనున్నారు. అగ్ర నేతల పర్యటనల కోసం బీజేపీ నేతలు పలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Leave a Reply