Navaratnalu

  • Contact us

ICICI బ్యాంక్ FD రేటు పెరిగింది: ICICI బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది, 15 నెలల FDపై 7.60% వడ్డీని ఇస్తుంది, తాజా రేట్లు తెలుసుకోండి.

February 28, 2023 by bharathi Leave a Comment

ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. సీనియర్ సిటిజన్లకు బ్యాంకు 7.60 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. రూ.2 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లతో పాటు రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచారు.

ICICI Bank FD Rate Increased: ICICI Bank increased interest on Fixed Deposits, giving 7.60% interest on 15-month FD, know the latest rates.

icici-bank-fd-rate-increased-icici-bank-increased-interest-on-fixed-deposits-giving-7-60-interest-on-15-month-fd-know-the-latest-rates

బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, రిటైల్ FDల కోసం వడ్డీ రేటు మార్పు ఫిబ్రవరి 24 నుండి వర్తిస్తుంది, అయితే బల్క్ డిపాజిట్ల కోసం వడ్డీ ఫిబ్రవరి 27 నుండి పెరిగింది. తాజా వడ్డీ రేట్ల గురించి వివరంగా తెలియజేయండి.

కనీస వడ్డీ రేటు ఇప్పుడు 3 శాతం.

రూ.2 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై కనీస వడ్డీ రేటు 3 శాతం, గరిష్ట వడ్డీ రేటు 7.10 శాతం. సీనియర్ సిటిజన్లకు కనీస వడ్డీ రేటు 3.50 శాతం మరియు గరిష్ట వడ్డీ రేటు 7.60 శాతం. 7 నుండి 29 రోజుల FD వడ్డీ 3%, 30-45 రోజుల FD వడ్డీ 3.50%, 46-60 రోజుల FD 4.25%, 61-90 రోజుల FD 4.50%, 91-184 రోజుల FD 4.75 శాతం.

పన్ను ఆదా చేసే FDపై 7% వడ్డీ లభిస్తుంది.

185-270 రోజుల ఎఫ్‌డిలపై 5.75 శాతం, 271 రోజుల నుంచి 365 రోజుల లోపు ఎఫ్‌డిలపై 6 శాతం వడ్డీ ఇస్తారు. 1 సంవత్సరం నుండి 15 నెలల లోపు FDలపై 6.70%, 15 నెలల నుండి 2 సంవత్సరాల వరకు 7.10%, 2 సంవత్సరాల నుండి 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు FDలపై 7% వడ్డీ అందుతోంది. 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాల వరకు FDలపై 6.90 శాతం వడ్డీ అందుతోంది. 5 సంవత్సరాల కంటే ఎక్కువ పన్ను ఆదా చేసే FDలపై 7% వడ్డీ అందుతోంది, దీని పరిమితి రూ. 1.5 లక్షలు.

సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వరకు వడ్డీ.

సీనియర్ సిటిజన్లకు కనీస వడ్డీ రేటు 3.50 శాతం మరియు గరిష్ట వడ్డీ రేటు 7.60 శాతం. 2 కోట్ల కంటే ఎక్కువ మరియు 5 కోట్ల కంటే తక్కువ బల్క్ డిపాజిట్లకు, కనీస వడ్డీ రేటు 4.75 శాతం మరియు గరిష్ట వడ్డీ రేటు 7.15 శాతం. ఈ వర్గంలోని సీనియర్ సిటిజన్లకు కనీస వడ్డీ రేటు 4.75 శాతం మరియు గరిష్ట వడ్డీ రేటు 7.15 శాతం.

Filed Under: Bank

LIC on Whatsapp: వాట్సాప్‌లో ఎల్‌ఐసీ సేవల కోసం ఎలా రిజిస్టర్‌ అవ్వాలి?

February 23, 2023 by bharathi Leave a Comment

LIC on Whatsapp: పాలసీదారులకు మెరుగైన సేవలందించేందుకు ఓ వాట్సాప్‌ (Whatsapp) నంబర్‌ను LIC అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా 10 రకాల సేవలు పొందొచ్చు.

How To Avail LIC WhatsApp Services in Telugu

how-to-avail-lic-whatsapp-services-in-telugu

జీవిత బీమా రంగ దిగ్గజం లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) పాలసీదారులకు ఎంతగానో ఉపయోగపడే సేవలను ప్రారంభించింది. వాట్సాప్‌ (Whatsapp)లో 10 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. పాలసీదారులు ఎల్‌ఐసీ కేటాయించిన వాట్సాప్‌ నంబర్‌కు హాయ్‌ (Hi) అని సందేశం పంపిస్తే చాలు.. సేవలను సులువుగా పొందొచ్చు. ప్రీమియం బకాయిలు, బోనస్‌ సమాచారం వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

పాలసీ వివరాలను ఎల్‌ఐసీ పోర్టల్‌లో నమోదు చేసుకొన్న వారు, తమ  మొబైల్‌ నంబరు నుంచి ఈ సేవలను పొందే వీలుంది. ఇంతకీ ఏయే సేవలు లభిస్తాయి? ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి? వివరాలను ఎలా పొందాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

how-to-avail-lic-whatsapp-services-in-telugu-1

వాట్సాప్‌లో సేవలు ఎలా?

ఎల్‌ఐసీ అధికారిక వాట్సాప్‌ నంబర్‌ 89768 62090ను మీ మొబైల్‌లో సేవ్‌ చేసుకోవాలి.

వాట్సాప్‌ ఓపెన్‌చేసి ఎల్‌ఐసీ చాట్‌ బాక్స్‌లోకి వెళ్లాలి.

HI అని సందేశం పంపగానే.. మీకు 11 ఆప్షన్లు కనిపిస్తాయి.

ప్రీమియం బకాయి తేదీ తెలుసుకోవడానికి 1.. మీ పాలసీపై వచ్చే లోన్‌ వివరాలు తెలుసుకోవడానికి 4 వంటి ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఆప్షన్లివే..

1. ప్రీమియం బకాయి

2. బోనస్‌ సమాచారం

3. పాలసీ స్థితి

4. పాలసీపై వచ్చే రుణ సమాచారం

5. రుణం తిరిగి చెల్లింపు

6. రుణంపై వడ్డీ

7. ప్రీమియం చెల్లింపు సర్టిఫికెట్‌

8. యులిప్‌- యూనిట్ల స్టేట్‌మెంట్

9. ఎల్‌ఐసీ సేవలకు సంబంధించిన లింకులు

10. ఆప్ట్‌ ఇన్‌/ఆప్ట్‌ ఔట్‌ సేవలు

11. సంప్రదింపులు పూర్తిచేయండి.

రిజిస్టర్‌ ఇలా..

ఎల్‌ఐసీ పోర్టల్‌లో నమోదు చేసుకొంటేనే ఈ సేవలను వాట్సాప్‌లో పొందే వీలుంటుంది. ఒకవేళ మీ మొబైల్‌ నంబర్‌ను గానీ, మీ ఎల్‌ఐసీ పాలసీ వివరాలను గానీ నమోదు చేసుకోకపోతే ఈ సేవలను పొందలేరు. ఒకవేళ మీరు రిజిస్టర్‌ చేసుకోకపోయి ఉంటే..

www.licindia.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

అందులో కస్టమర్‌ పోర్టల్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి..

మీరు కొత్త యూజర్‌ అయితే New Userపై క్లిక్‌ చేసి పూర్తి వివరాలు నమోదు చేయండి.

ఒకవేళ మీరు పాత యూజర్‌ అయితే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వండి.

అందులో బేసిక్‌ సర్వీసెస్‌ విభాగంలో యాడ్‌ పాలసీని క్లిక్‌ చేసి ఎన్ని పాలసీలు ఉంటే అన్ని పాలసీల వివరాలు అక్కడ నమోదు చేయొచ్చు.

Filed Under: Bank

SBI Education Loan: ఆ చార్జీలు లేకుండా రూ.20 లక్షల లోన్ | ఎస్‌బీఐ బంపరాఫర్

February 23, 2023 by bharathi Leave a Comment

Education Loan | దేశీ కేంద్ర బ్యాంక్ ఎస్‌బీఐ కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో రుణాలు కూడా ఒక భాగమని చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ (SBI) వివిధ రకాల లోన్స్ (Loan) ఆఫర్ చేస్తోంది. వీటిల్లో పర్సనల్ లోన్స్ దగ్గరి నుంచి పెన్షన్ లోన్స్ వరకు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ లోన్ గురించి మాట్లాడుకుందాం. అర్హత కలిగిన వారు ఎస్‌బీఐ నుంచి ఈజీగానే విద్యా రుణం పొందొచ్చు. ఏకంగా రూ. 20 లక్షల వరకు లోన్ లభిస్తుంది.

SBI Education Loan

ఎస్‌బీఐ ఎడ్యుకేషన్ లోన్‌ను 15 ఏళ్లలోగా తిరిగి చెల్లించొచ్చు. కోర్సు అయిపోయిన తర్వాత, 12 నెలల రీపేమెంట్ హాలిడే తర్వాత నుంచి ఈ టెన్యూర్ ప్రారంభం అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు. రూ. 20 లక్షల వరకు రుణానికి ఇది వర్తిస్తుంది. అదే రూ. 20 లక్షలకు పైన లోన్ అయితే రూ. 10 వేల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవాలి. సెక్యూరిటీగా తల్లిదండ్రులు సహ రుణదారుగా ఉండాలి. ఎలాంటి తనఖా అవసరం లేదు. రూ. 7.5 లక్షల వరకు అయితే ఇది వర్తిస్తుంది. ఆపైన మొత్తం అయితే తనఖా అవసరం అవుతుంది.

రూ. లక్షల వరకు లోన్ అయితే మార్జిన్ అవసరం లేదు. ఆపైన అమౌంట్ అయితే 5 శాతం మార్జిన్ ఉంటుంది. దేశంలో చదువుకుంటే ఇది వర్తిస్తుంది. విదేశీ విద్య అయితే 15 శాతం మార్జిన్ ఉంటుంది. ఉన్నత చదువుల కోసం రెండో లోన్ తీసుకొని ఉంటే.. అప్పుడు కూడా 15 ఏళ్లలోపు రుణం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ రేటు 8.3 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.

దేశంలో లేదా విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించాలని భావించే భారతీయ పౌరులు అందరూ బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ పొందొచ్చు. గ్రాడ్యుయేషన్ దగ్గరి నుంచి ఐఐటీ, ఐఐఎం వరకు చాలా కోర్సులకు ఎడ్యుకేషన్ లోన్ పొందొచ్చు. డిగ్రీ, డిప్లొమా కోర్సులకు కూడా లోన్ వర్తిస్తుంది. దేశంలో చదవడానికి గరిష్టంగా రూ. 50 లక్షల వరకు లోన్ ఇస్తారు.

అదే విదేశాల్లో చదవడానికి అయితే గరిష్టంగా రూ. 1.5 కోట్ల వరకు లోన్ పొందొచ్చు. మెడికల్ కోర్సులకు రూ. 30 లక్షల లోన్ వస్తుంది. ఇతర కోర్సులకు రూ. 10 లక్షల వరకు లోన్ పొందొచ్చు. టూవీలర్ కాస్ట్, ట్రావెల్ ఎక్స్‌పెన్స్, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్, రిఫండబుల్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, బుక్స్ ఎక్విప్‌మెంట్ వంటి కొనుగోలు, ఎగ్జామినేషన్ లేదా లైబ్రెరీ లేదా ల్యాబొరేటరీ ఫీజు, కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు వంటివి అన్నీ లోన్ కింద కవర్ అవుతాయి. మార్క్ షీట్స్, అడ్మిషన్ ప్రూఫ్, ఆధార్, పాన్ కార్డు, ఫోటోలు వంటి పలు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

Filed Under: Bank

Bank Account: ఈ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్.. ప్రతి నెలా డబ్బులు!

February 21, 2023 by bharathi Leave a Comment

Savings Account | బ్యాంక్ అకౌంట్‌పై అధిక వడ్డీ రేటు పొందాలని భావిస్తున్నారా? అది కూడా ప్రతి నెలా వడ్డీ డబ్బులు బ్యాంక్ ఖాతాలోకి పొందాలని చూస్తున్నారా? అయితే ఈ బ్యాంక్ మీకు అనువైంది.

IDFC FIRST BANK EARN UP TO 6 75 PERCENT INTEREST ON SAVINGS ACCOUNT

Bank News | బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీకు పలు రకాల సర్వీసులు ఉచితంగా లభిస్తూ ఉంటాయి. అలాగే మరి కొన్నింటికి మాత్రం చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలా బ్యాంకులు అకౌంట్ ఉన్న వారికి ఎన్నో రకాల సర్వీసులు అందుబాటులో ఉంచాయి.

బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి లభిస్తున్న అనేక సర్వీసుల్లో వడ్డీ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. అంటే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఉంటే.. వాటిపై వడ్డీ వస్తుంది. ఎంత మొత్తంపై ఎంత వడ్డీ వస్తుందనే అంశం పలు అంశాల ప్రతిపదికన మారుతుంది.

చాలా వరకు బ్యాంకులు బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బుల ఆధారంగా వడ్డీని అందిస్తూ ఉంటాయి. అంటే రూ. లక్ష వరకు బ్యాలెన్స్ ఉంటే ఒక వడ్డీ రేటు, ఆపైన బ్యాలెన్స్ ఉంటే మరో వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇలా బ్యాంక్ అకౌంట్‌లోని బ్యాలెన్స్ ప్రాతిపదికన మీకు వచ్చే వడ్డీ మారుతుంది.

అంతేకాకుండా బ్యాంక్ ప్రాతిపదికన కూడా వడ్డీ రేటులో మార్పు ఉంటుంది. ఒక బ్యాంక్ ఎక్కువ వడ్డీ అందిస్తే.. మరో బ్యాంక్ తక్కువ వడ్డీ అందిస్తూ ఉంటాయి. అందువల్ల వడ్డీ రేటు అనేది బ్యాంక్ ప్రాతిపదికన మారుతూ ఉంటుందని గమనించాలి.

ఇప్పుడు మనం అధిక వడ్డీ రేటు అందించే బ్యాంకుల్లో ఒకటైన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. ఈ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై గరిష్టంగా 6.75 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది.

ఎస్‌బీఐ సహా ప్రముఖ బ్యాంకుల్లోని సేవింగ్స్ ఖాతాలపై ఉన్న వడ్డీ రేట్లతో పోలిస్తే.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లోనే అధిక వడ్డీ రేటు వస్తోందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ బ్యాంక్‌లో అకౌంట్ లేని వారు ఆన్‌లైన్‌లోనే ఖాతా తెరవొచ్చు.

అధిక వడ్డీ రేటు మాత్రమే కాకుండా ఈ బ్యాంక్‌లో ఖాతా ఓపెన్ చేయడం వల్ల పలు రకాల ప్రయోజనాలు కూడా పొందొచ్చు. సేవింగ్స్ ఖాతాలపై వచ్చే వడ్డీ మొత్తం ప్రతి నెలా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. చాలా వరకు బ్యాంకులు మూడు నెలలకు ఒకసారి వడ్డీ డబ్బులు చెల్లిస్తాయి.

అంతేకాకుండా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కస్టమర్లు డెబిట్ కార్డుపై రూ. 6 లక్షల వరకు పర్చేజ్ లిమిట్ పొందొచ్చు. ఇంకా ఏటీఎం నుంచి డెబిట్ కార్డు ద్వారా ఒకే రోజు రూ. 2 లక్షల వరకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇంకా మరో బెనిఫిట్ కూడా ఉంది. ఈ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా కలిగిన వారు ఎలాంటి చార్జీలు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్ని సార్లు అయినా డబ్బులు విత్‌డ్రా చేయొచ్చ.

Filed Under: Bank

SBI బంపరాఫర్‌ | వ్యాపారం చేయాలనుకునేవారికి రూ.10 లక్షల లోన్‌

February 21, 2023 by bharathi Leave a Comment

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సాహించడం, స్వయం ఉపాధి పొందాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్లు అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా సుమారు 10 లక్షల రూపాయల వరకు లోన్‌ ఇస్తుంది.

SBI Offers Rs 10 Lakh in e-Mudra Loan Full Details Here | How to Apply for It ?

sbi-offers-rs-10-lakh-in-e-mudra-loan-full-details-here-how-to-apply-for-it

జాబ్‌ చేసే ఆలోచన లేదు.. సొంత ఊరిని విడిచి దూరంగా పట్నం వెళ్లాలంటే మనసు రావడం లేదు. కానీ ఊరిలో ఉపాధి మార్గాలు తక్కువ.. పోనీ ఏదైనా వ్యాపారం చేద్దామా అంటే.. కనీసం లక్ష రూపాయాలైనా పెట్టుబడి పెట్టాలి.. కానీ అంత మొత్తం చేతిలో లేదు… ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా.. అయితే మీలాంటి వాళ్ల కోసమే భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి.. తగిన సొమ్ము లేక బాధపడుతున్న వారి కోసం ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. సుమారు 10 లక్షల రూపాయల వరకు లోన్‌ ఇచ్చేందుకు రెడీగా ఉంది ఎస్‌బీఐ. ఇంతకు ఈ లోన్‌ పొండానికి అర్హతలు ఏంటి.. ఎలాంటి డాక్యుమెంట్స్‌ కావాలి.. తదితర పూర్తి వివరాలు ఇక్కడ..

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సాహించడం, స్వయం ఉపాధి పొందాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్లు అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా సుమారు 10 లక్షల రూపాయల వరకు లోన్‌ ఇస్తుంది. కాగా దేశంలోనే అతి పెద్ద బ్యాంక్‌గా గుర్తింపు పొందిన భారతీయ స్టేట్‌ బ్యాక్‌ కూడా.. ముద్ర యోజన కింద వ్యాపారం చేయాలనుకునేవారికి బిజినెస్‌, వర్కింగ్‌ కాపిటల్‌ లోన్స్‌ అందిస్తుంది. ముద్ర యోజన కింద ఎస్‌బీఐ 50 వేల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్‌ ఇస్తుంది. ఐదేళ్లలోపు తిరిగి చెల్లించే అవకాశం కల్పిస్తుంది.

ఎవరు అర్హులంటే..
ఒక్కరే సొంతంగా వ్యాపారం చేయాలనుకువారికి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రలు స్థాపించాలనుకునేవారికి, తయారీ, ట్రేడింగ్‌ రంగాల్లో వ్యాపారం చేయాలనుకునేవారు ఎస్‌బీఐ ముద్ర, ఇ-ముద్ర లోన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ సేవింగ్స్‌, కరెంట్‌ అకౌంట్స్‌ ఉన్నవారు ఈ ఎస్‌బీఐ ముద్ర లోన్స్‌కు అర్హులు. మరి ఎస్‌బీఐ ఇ ముద్ర యోజనకు ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు..

ఏమేం డాక్యుమెంట్స్‌ కావాలంటే..

  • పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో జత చేసి.. అప్లికేషన్‌ ఫామ్‌ని పూర్తి చేయాలి.
  • అప్లికేషన్‌తో పాటు కేవైసీ డాక్యుమెంట్స్‌ అనగా పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డ్‌ వంటి వాటిని సమర్పించాలి.
  • సేవింగ్స్‌, కరెంట్‌ అకౌంట్‌ నంబర్స్‌, బ్రాంచ్‌ వివరాలు తెలపాలి.
  • బిజినెస్‌ వాలిడేషన్‌ వివరాలు అంటే పేరు, ఎప్పుడు ప్రారంభం అయ్యింది, అడ్రెస్‌ వంటివి.
  • ఆధార్‌ నంబర్‌(తప్పకుండా బ్యాంక్‌ ఖాతాకు అప్‌డేట్‌ అయి ఉండాలి)
  • కులానికి సంబంధించిన వివరాలు..
  • జీఎస్‌టీఎన్‌, ఉద్యోగ్‌ ఆధార్‌ నంబర్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
  • షాపు నెలకొల్పినట్లు నిరూపించే డాక్యుమెంట్స్‌, బిజినెస్‌ రిజిస్ట్రేషన్‌ వివరాలు అవసరం ఉండొచ్చు.

అర్హత ప్రక్రియ..

దరఖాస్తుదారు తప్పనిసరిగా తయారీ లేదా సేవా రంగం వంటి వ్యవసాయేతర ఆదాయం పొందే రంగంలో పని చేయాలి.

దరఖాస్తుదారు కనీసం రెండేళ్లపాటు ఒకే స్థలంలో నివసించి ఉండాలి.

ఎస్‌బీఐ ఇ-ముద్ర లోన్‌కు ఎలా దరఖాస్తు చేయాలంటే..

ప్రస్తుతం ఎస్‌బీఐలో కరెంట్‌, సేవింగ్స్‌ అకౌంట్‌ ఉన్నవాళ్లు.. 10 లక్షల రూపాయల వరకు ఇ-ముద్ర లోన్‌కు అప్లై చేసుకోవచ్చు.

ముందుగా ఎస్‌బీఐ ఇ-ముద్ర పోర్టల్‌ని సందర్శించాలి.

ఇందుకు గాను ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

తర్వాత ప్రొసీడ్‌ బట్‌ను ప్రెస్‌ చేయాలి.

ఓటీపీ అథెంటికేషన్‌ ద్వారా లోన్ ప్రాసెసింగ్, పంపిణీ కోసం ఇ-కేవైసీ, ఇ-సైన్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. కాబట్టి, ఆధార్‌ కార్డ్‌ వివరాలను తప్పనిసరిగా అందించాలి.

ఎస్‌బీఐ ఫార్మాలిటీలు, లోన్ ప్రాసెస్‌ని పూర్తి చేసిన తర్వాత, దరఖాస్తుదారు తప్పనిసరిగా ఇ-ముద్ర పోర్టల్‌కి తిరిగి రావాలని వారికి మెసేజ్‌ పంపుతారు.

తర్వాత లోన్ ఆమోదాన్ని నిర్ధారిస్తూ మెసేజ్‌ వచ్చిన 30 రోజులలోపు లోన్‌ అప్రూవల్‌ పూర్తి అవుతుంది.

Filed Under: Bank

  • 1
  • 2
  • 3
  • Next Page »

Recent Posts

  • Arogyasri Card Free Download Online Easy Process
  • YSR Kapu Nestham & YSR Vahana Mithra-2024 Application | వైస్సార్ కాపు నేస్తం & వైస్సార్ వాహన మిత్ర-2024
  • AP Cabinate Decessions-July 2023 | AP కేబినెట్ నిర్ణయం-జూలై 2023
  • AP Government Employees and pensioners 12th PRC Pay Scales | 12th PRC Pay Scales fixation process
  • GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT G.O. Rt. No.675
  • ఎమ్మెల్యే కూతురు, పేద మెకానిక్ కొడుకు సినిమా టైటిల్ కాదు, ప్రొద్దుటూరులో నిజం.
  • DDO List for 61 Srikakulam (District) – 6102 STO – Srikakulam (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2704 PAO – AP Bhavan (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2703 AP State Capital Region Treasury (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2700 Pay & Accounts Office – Andhra Pradesh (Treasury)

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in