టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.ఇసుక పాలసీ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Investigation on CHANDRABABUS Anticipatory Bail in Sand Policy Case
గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఇసుక పాలసీ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం జరిగిందని ఏపీఎండీసీ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది.టీడీపీ హయాంలో ఇసుక పాలసీలో భారీగా అవకతవకలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొంది.
సీఐడీ కేసు నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.