హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవరత్నాలు డాట్ కామ్ (navaratnalu.com) వెబ్ సైట్, ఈ వెబ్ పేజి ద్వారా ఈ బిసి నేస్తం ఎలిజిబుల్ లిస్ట్ ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలి ఈబిసి నేస్తం అంటే ఏమిటి EBC నేస్తానికి అర్హులు ఎవరు, EBC NESTHAM బయోమెట్రిక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం. ఈ పేజీ ని పూర్తిగా చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.
ఈ బీసీ నేస్తం అంటే ఏమిటి
EBC NESTHAM గురించి : ఈబీసీ నేస్తం అంటే ఏమిటంటే ఇప్పటి వరకూ అన్ని పథకాలలో కూడా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, ఓసి కాపు కులాలలో 45 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు వారందరికీ కూడా కాపు నేస్తం పేరుతో గాని వైఎస్సార్ చేయూత పేరుతో గాని వివిధ రకాల పేర్లతో ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈబిసి నేస్తం పథకానికి అర్హులు ఎవరు
ఇక అగ్రవర్ణాల కులాలలో ఎవరైతే మిగిలిపోయారో రెడ్డి, కమ్మ, నాయుడు, వెలమ, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య ఈ కులాల వారు ఎవరైతే మిగిలిపోయారో, వాళ్లకి కూడా అంటే అగ్రవర్ణాల కులాలలో కూడా పేద వారుగా ఉంటే వారికి కూడా ఆర్థిక సహాయం చేద్దాం అన్న ఉద్దేశంతోనే ఈ బీసీ నేస్తం అనే పథకాన్ని పెట్టడం జరిగింది. ఈ పథకాన్ని 2022 వ సంవత్సరంలో విజయవంతంగా అందజేశారు అలాగే ఇప్పుడు 2023 ఈ సంవత్సరం కూడా ఇస్తున్నారు.
కాబట్టి దీనికి సంబంధించి గతంలో ఎవరి పేర్లు అయితే నమోదు అయ్యాయో వారి పేర్లు ఇప్పుడు ఎలిజిబుల్ లిస్టులో ఉంటాయి. కాబట్టి అప్లై చేసిన వారందరూ మీ వాళ్ళ ఇంటిదగ్గర మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ మీ పేరు లిస్టులో ఉంటే మీరు బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది ఈ పథకాన్ని పొందడానికి.
ఈ బీసీ నేస్తం బయోమెట్రిక్ ఎంట్రీ డీటెయిల్స్ ప్రాసెస్
ఈ బయోమెట్రిక్ ప్రాసెస్ ఎక్కడినుంచైనా చేయవచ్చా : ఒకవేళ మీరు మీ ఊరిలో లేకుండా వేరే జిల్లాలో లేదా వేరే ఊర్లో ఉన్నప్పుడు ఈ బయోమెట్రిక్ అక్కడ ఎలా వేయాలో తెలుసుకుందాం : అర్హులు గల వారు మీరు మీ ఊరిలో లేకుంటే వేరే ఊరిలో ఉన్న కూడా ఈ బయోమెట్రిక్ ప్రాసెస్ చేయవచ్చు, అది ఎలా అంటే అక్కడ మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో వెళ్ళి వార్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారి లాగిన్ లో కూడా మీ ఆధార్ నెంబర్ సెర్చ్ చేసి కూడా మీరు బయోమెట్రిక్ వేయవచ్చు (కానీ అక్కడ వాలంటీర్ ద్వారా మాత్రం వేయలేరు, కేవలం అక్కడ సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా మాత్రమే ఈ బయోమెట్రిక్ చేయగలరు).
కొత్తగా ఎవరైనా ఈ పథకానికి అప్లై చేసుకునే అవకాశం ఉందా ? ప్రస్తుతానికి ఆల్రెడీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కేవైసీ ద్వారా రెన్యువల్ చేస్తున్నారు కొత్తగా ఎలిజిబిలిటీ ఉన్న వారిని ఇంకా నమోదు చేయడం లేదు. కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వారు మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ లను రెడీ చేసి పెట్టుకోండి, ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే కొత్తగా అర్హులైన వారికి అప్లై చేసుకునే అవకాశం ఉంది అని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో మరియు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుందో అనే విషయాన్ని వెంటనే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము. Keep update with this webpage. As always you are welcome to ask your queries through below comment session.
ఈబీసీ నేస్తం ఎలిజిబుల్ లిస్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యనే ఈబీసీ నేస్తం పథకం అర్హులకి డబ్బులు అందజేయడం జరిగింది. అర్హులైన వారు ఎవరికైనా డబ్బులు మీ అకౌంట్లో జమ కాలేదు నట్లయితే మీరు ఆన్లైన్లో కూడా మీ లిస్టు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో EBC Nestam ఎలిజిబుల్ లిస్ట్ తెలుసుకోవడానికి కింద ఉన్న ప్రొసీజర్ ని ఫాలో అవ్వండి. లేదా పైన ఉన్న నా ఫోటో మీద క్లిక్ చేస్తే ఈ బీసీ నేస్తం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
Steps to find EBC Nestham eligible list
Click here to open the eligible list district wide
Click on your District name
Now click on your Mandal
Now click on your village (or) town
Click on your region and check your name.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.