నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌పీడీసీఎల్) 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ కేటగిరీల విద్యుత్ టారి్‌ఫలో ఎలాంటి పెంపును ప్రకటించలేదు.
No Increase in Electricity Charges
ఎన్‌పీడీసీఎల్ పరిధిలో పాత చార్జీలే వర్తింపు
నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌పీడీసీఎల్) 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ కేటగిరీల విద్యుత్ టారి్‌ఫలో ఎలాంటి పెంపును ప్రకటించలేదు. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రతిపాదనలే 2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగిస్తున్నట్టు ఎన్‌పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు ప్రకటించారు. దీనితో విద్యుత్తు వినియోగదారులకు ఊరట కలిగినట్లయింది. ఎన్‌పీడీసీఎల్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్తు టారిఫ్ ప్రతిపాదనలు, 2016-17 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు విద్యుత్తు కొనుగోళ్ల ట్రూ అప్ చార్జీలపై బహిరంగ విచారణ బుధవారం హనుమకొండ కలెక్టర్ కార్యాలయం సమావేశం హాల్‌లో నిర్వహించారు.
దీనికి టీఎస్ఈఆర్‌సీ చైర్మన్ రంగారావు, సభ్యులు మనోహర్ రాజు (టెక్నికల్), బి క్రిష్ణయ్య (ఫైనాన్స్) హాజరయ్యారు. ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. ఎన్‌పీడీసీఎల్ ఆదాయ, వ్యయానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, అందుకుగల కారణాలను వివరించారు. ప్రస్తుతం ఉన్న టారి్‌ఫలనే యధాతథంగా కొనసాగించనున్నట్టు చెప్పారు.