చరిత్ర : మునపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 అనే కేంద్ర చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా విభజించిన మీదట 2014, జూన్ 2వ తేదీన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయింది.
దార్శనికత మరియు లక్ష్యం
దార్శనికత
- ‘ప్రజలే ముందు’ అనే సూత్రంపై ఆధారపడిన అత్యంత సమర్ధవంతమైన, పటిష్టమైన మరియు జవాబు దారీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం.
లక్ష్యం
- ఈ క్రింది అంశాల ద్వారా ‘ప్రజలే ముందు’ విధానాలను రూపొందించి, కొనసాగించడం.
- మంత్రి మండలి నిర్ణాయక రూపకల్పనలో మెరుగుదలలు మరియు మంత్రి మండలి నిర్ణయాలు సకాలంలో అమలు అయ్యేవిధంగా పర్యవేక్షించడం.
- ప్రభుత్వంలో సీనియర్ మేనేజ్ మెంట్ హోదాలకు సరైన వ్యక్తులను నియమించడం.
- ఆంధ్రప్రదేశ్ కేడర్లలో ఇండియన్ అడ్మిన్ స్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ పోలీసు సర్వీసు మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు అధికారుల కేడరును నిర్వహించడం.
- సిబ్బంది శిక్షణ.
- రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ.
- రాష్ట్ర ఉద్యోగులపై నిఘా ఉంచడం.
- అవినీతి నిరోధక చర్యల ద్వారా పరి పాలనలో న్యాయవర్తనను పెంపొందించడం.
- సుపరిపాలన కోసం నూతన కార్యక్రమాలు అమలు చేయడం.
- రాష్ట్రాన్ని సందర్శించే ఉన్నత హోదాగల వ్యక్తుల వ్యవహారాలు చూడడం.
వ్యవస్థా స్వరూపం
వివరణ : కార్యదర్శి – ప్రభుత్వ కార్యదర్శి (కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/ప్రత్యేక ప్రధాన కార్యదర్శి):
ఎంఎల్ ఓ : మధ్యస్థాయి అధికారి (ఉపకార్యదర్శి/సంయుక్త కార్యదర్శి/అదనపు కార్యదర్శి/ ప్రత్యేక విధినిర్వాహణ అధికారి) ; సహాయ కార్యదర్శి.
రాష్ట్ర గేయం
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతి నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.
– రచయిత : శంకరంబాడి సుందరాచారి
-పాడిన వారు : శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి