పై అంశాలకి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Madyapana Nishedam (మద్య నియంత్రణ) – నవరత్నాలు Scheme
మద్య నియంత్రణ (నవరత్నాలు) పథకం :
మూడు దశల్లో మద్యాన్ని నిషేధించి
మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేయడం.
మద్యపాన నిషేధం
కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది.
మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి.
అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తాం.
సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
YSR Aasara (వైయస్ఆర్ ఆసరా) – నవరత్నాలు Scheme
వైయస్ఆర్ ఆసరా (నవరత్నాలు) పథకం :
ఈ పథకం కింద ఎన్నికల రోజు వరకు ఉన్న పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా అక్కచెల్లెమ్మల చేతికే నేరుగా అందిస్తారు. అంతేకాకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారు.
ఆ వడ్డీ డబ్బును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. దీనివల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.50 వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది.
అదేవిధంగా “వైయస్ఆర్ చేయూత” ద్వారా 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో రూ.75 వేలు దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా అందిస్తారు.
Recent Posts
ఈబీసీ నేస్తమ్ మంజూరైంది FY 2023
వైఎస్సార్ ఆసరా , వైఎస్సార్ చేయూత
ఎన్నికల రోజు వరకు అక్కచెల్లమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం.
అంతే కాదు మళ్ళీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం ఆ వడ్డీ డబ్బు మేమే బ్యాంక్ లకు అక్కచెల్లమ్మల తరపున కడతాం.
వైఎస్సార్ చేయూత ద్వారా ప్రతి బిసి ,ఎస్సీ ఎస్టీ , మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం.
ప్రస్తుతం కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా, ఏ కొందరికో అరకొరగ ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్డితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం.
45 సంవత్సరాలు నిండిన ప్రతి బిసి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ అక్కలకు వైఎస్సార్ చేయూత ద్వారా మొదట ఏడాది తరువాత దశలవారీగా రూ. 75 వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం.
సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
YSR Rythu Bharosa (వైయస్ఆర్ రైతు భరోసా) – నవరత్నాలు Scheme
వైయస్ఆర్ రైతు భరోసా (నవరత్నాలు) పథకం :
ప్రతి రైతు కుటుంబానికి ప్రతి యేటా రూ.13500 పెట్టుబడి కోసం ఇస్తారు. ఉచిత బోర్లు వేయించడం, ఉచిత విద్యుత్ అందించడం, సున్నావడ్డీకి రుణాలు, రైతులు వాడే ట్రాక్టర్లపై రోడ్ టాక్స్ మాఫి ఇందులో వర్తించే అంశాలే. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి ఏడాది నుంచి మే నెలలో పెట్టుబడి కోసం ఏడాదికి రూ.13,500 చొప్పున వరుసగా ఐదేళ్లు అందించటం జరుగుతుంది .
వ్యవసాయానికి పగలే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారు. ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను యూనిట్ కు రూ.1.50కు తగ్గించటం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు.
ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, అవసరమైతే ఆహారశుద్ధి యూనిట్లను ఏర్పాటు చేయటం. సహకార రంగాన్ని పునరుద్ధరించి.
సహకార డైరీలకు పాలుపోసే పాడి రైతులకు లీటర్ కు రూ.4 సబ్సిడీ ఇస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు “వైయస్ఆర్ బీమా” ద్వారా రూ.5 లక్షలు చెల్లించటం జరుగుతుంది.
వైఎస్సార్ రైతు భరోసా – YSRCP Navaratnalu (జగన్ నవరత్నాలు) ప్రధాన పధకం
- ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తాం. పంటవేసే సమయానికి మే నెలలో రూ.12,500 చొప్పున ఇస్తాం.
- పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రేమియమ్ మొత్తాన్ని మేమే చెల్లిస్తాం.
- రైతన్నలకి వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం.
- రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం.
- వ్యవసాయానికి పగటిపూటే 9 గం. ఉచిత కరెంట్.
- ఆక్వారైతులకు కరెంట్ ఛార్జీలు యూనిట్ కు రూ.1.50 కే ఇస్తాం.
- రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం.
- రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు.
- ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజక వర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు.
- మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండవ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్ కు రూ. 4 బోనస్.
- వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రద్దు చేస్తాం, టోల్ టాక్స్ రద్దు చేస్తాం.
- ప్రమాదవశాత్తూ లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.7 లక్షలు ఇస్తాం. అంతే కాదు ఆ డబ్బును అప్పులవాళ్ళకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకువచ్చి ఆ రైతు కుటుంబానికి అందగా ఉంటాం.
సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
Pension Pempu (పింఛన్ల పెంపు) – నవరత్నాలు Scheme | Pension Kanuka
పింఛన్ల పెంపు (నవరత్నాలు) పథకం :
ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.27,000 నుంచి రూ.36,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది.
ప్రస్తుతం పింఛన్ తీసుకోవడానికి ఉన్న వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించడం జరిగింది.
అవ్వతాతలకు నెలకు రూ.2500, ఇస్తూ దానిని రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాము.
దివ్యాంగులకు రూ.3000 పింఛన్ అందిస్తున్నారు.
పింఛన్ల పెంపు
ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయస్సు 65 నుంచి 60కి తగ్గిస్తాం.
అవ్వా తాతల పింఛన్ రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోతాం.
వికలాంగులకు పింఛన్ రూ. 3,000 ఇస్తాం.
సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.