AP Cabinate: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అంటే జులై 12, 2023 వ తేదీన ముఖ్యంమత్రి గారి అద్యక్షతన AP Cabinate సమావేశం జరిగింది.ఇందులో చాలా అంశాలను అజెండాలో చేర్చడం జరిగింది.కానీ మనము ఇప్పుడు మన వెబ్సైటు నందు ప్రజలకు అవరసరమయ్యేది సంక్షేమ పథకాలే కాబట్టి వాటి గురించి మాత్రమే చెప్పుకుందాం.
AP Cabinate లో ఆమోదించిన సంక్షేమ పథకాలు
జులై 18 వ తేదీన జగనన్న తోడు – చిరువ్యాపారులకు వడ్డీ లేకుండా ఇచ్చే 10,000 ల అప్పును తీసిచ్చే కార్యక్రమమే ఈ జగనన్న తోడు కార్యక్రమం.ఇదివరకే PM SVANIDHI ద్వారా మొదటి దఫా తీసుకుని ఉంటే మరుసటి లోన్ పెంచి రెండవ లోన్ 20 వేలు అదేవిధంగా మూడవ లోన్ 50 వేలు ఇస్తారు.కనుక దీనిగురించి ఎక్కువ వివరాలు పొందాలి అనుకున్న వారు మీ ఏరియా లోని డ్వాక్రా కి సంబంధించిన RP ని కలవగలరు.ఇంకా ఏమైనా సందేహాలు సమస్యలు వున్నచో 1902 నెంబర్ కి జగనన్న చెబుదాం అనే కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి కి చెప్పుకోవచ్చును.
జులై 21 వ తేదీన నేతన్న నేస్తం – చేనేత మగ్గం ఉండి తద్వారా సంపాదనతోనే కుటుంబజీవనాన్ని కొనసాగించే వారికి సంవత్సరానికి 24 వేల రూపాయలను ఉచితంగా ఆర్ధిక సాయం చేసే పథకమే ఈ నేతన్న నేస్తం.
జులై 26 వ తేదీన YSR సున్నవడ్డీ – రాష్ట్రంలోని పొదుపు మహిళా సంఘాల మహిళలకు వరుసగా నాలుగో ఏడాది కూడా వడ్డీ లేని రుణాలను మంజూరు చేయనున్నారు.
జులై 28 వ తేదీన విదీశీ విద్యా దేవేన – బాగా చదువుకుని ఉన్నత చదువుల కొరకు విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు చేసే ఆర్ధిక సాయమే ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమం.
Conclusion
ఈ పేజీ లో మనము ఇప్పటివరకు ఈ జులై నెలలో ప్రారంభం కాబోవు సంక్షేమ పథకాల గురించి క్లుప్తంగా వివరించుకున్నాము.కానీ ఇంకా ఏమైనా వీటికి సంబంధించి అప్డేట్స్ వస్తే ఎప్పటికప్పుడు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు వివరించే ప్రయత్నం చేస్తాను.
For any queries regarding above topic, please tell us through below comment session.