PAN Card: ఈ రోజుల్లో అన్నీ డిజిటల్ చెల్లింపులు కావటం వల్ల పాన్ కార్డ్ కంపర్సరీ అయిపోయింది. ప్రభుత్వానికి సంబంధించిన చాలా స్కీమ్స్ కూడా పొందటానికి పాన్ కార్డ్ తప్పక ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో చాలా మంది వాటిని అక్రమాలకు పాల్పడేందుకు సైతం వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ నుంచి తప్పించుకోవటానికి దుర్వినియోగం చేస్తున్నారు.
If You Make This Mistake with Pan Card Will, Be Jailed, Be Careful
దాచాలనుకున్నా దాగదు..?
మనలో చాలా మంది టాక్స్ చెల్లించని వారు ఉంటారు. అయితే వారు చట్టపరంగా టాక్స్ చెల్లించాలా..? చెల్లించాల్సిన అవసరం లేదా..? అనే విషయాన్ని గుర్తించేందుకు పాన్ కార్డ్ ద్వారా అదాయపు పన్ను అధికారులు ట్రాకింగ్ చేస్తుంటారు. పైగా ఈ రోజుల్లో ఆధార్ కార్డు, పాన్ కార్డ్ లను లింక్ చేయాలని కేంద్రం వెల్లడించింది. అలా చేయకపోతే కార్డులు తర్వాత పనిచేయవని వెల్లడించింది. దీని ద్వారా ప్రజలు చేసే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను ప్రభుత్వం గుర్తిస్తుంది. దీనివల్ల వివరాలను దాచిపెట్టాలన్నా కుదరదు.
జైలుకెళ్లాల్సిందే !
PAN కార్డ్ విషయంలో నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. ఇందులో గుర్తుంచుకోవలసిన అసలు విషయం ఏమిటంటే.. ఒకే వ్యక్తికి రెండు పాన్ కార్డులు అస్సలు ఉండకూడదు. ఒకవేళ గనుక అలా ఉన్నట్లయితే ఆదాయపు పన్ను అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలాంటి వారిని గుర్తించినప్పుడు రూ.10 వేలు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు.
రెండో కార్డ్ ఏం చేయాలి..?
ఒకవేళ మీ వద్దర కూడా రెండు పాన్ కార్డులు ఉన్నట్లయితే వెంటనే.. రెండో పాన్ కార్డును తిరిగి అందజేయవచ్చని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది .మీరే రెండవ పాన్ కార్డును డిపార్ట్‌మెంట్‌కు అందజేస్తే.. ఎటువంటి జరిమానా ఉండదు. కానీ.. డిపార్ట్‌మెంట్ అధికారులు నిఘాలో పట్టుకుంటే మాత్రం పెద్ద ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
సరండర్ ప్రక్రియ !
వినియోగదారులు తమ అదనపు పాన్‌ను ఆఫ్‌లైన్‌లో సరెండర్ చేయడానికి సమీపంలోని NSDL సేకరణ కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ వారికి PAN కరెక్షన్ ఫారమ్‌ను అందించాలి. అందులో డూప్లికేట్ PAN వివరాలను పొందుపరిచి జూరిడిక్షనల్ అసెస్సింగ్ ఆఫీసర్ కు పాన్ క్యాన్సిల్ చేయాలని అభ్యర్థించాలి. అలా రెండో పాన్ కార్డును క్యాన్సిల్ చేసుకోవచ్చు.