ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పేదలందరికీ ఇల్లు అంటే ఏమిటి ?
పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఇల్లు లేదా ఇంటి స్థలం కోరే పేదలందరికీ ఇంటి స్థలం మరియు పక్కా ఇల్లు నిర్మాణం.
అర్హతలు :
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని లబ్ధిదారులు ఎవరైనా విధిగా దారిద్య రేఖకు దిగువ వర్గాల కు చెందిన ఉండవలెను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా లదబ్దిదారునికి సాంత గృహము/ ఇంటి స్టలం ఉండరాదు
గతంలో కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఏవిధమైన గృహ పధకాలలో లబ్దిదారు ప్రయోజనం పొంది ఉండరాదు
మొత్తం కుటుంబానికి మాగాణి 3 ఎకరాలు లేదా మెట్ట 10 ఎకరాలు లేదా మాగాణి మరియు యెట్ట కలిపి 10 ఎకరాలకు లోపుగా ఉండవలెను.
జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకొనే విధానము:
అర్హత కల్గిన దరఖాస్తుదారులు వారి ఆధార్ కార్డు మరియు భూమి యాజమాన్య అడంగల్ కాపీని జతచేసిన దరఖాస్తును నేరుగా గ్రామ/వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చును.
అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request- మీ సేవల అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది.
దరఖాస్తు చేసిన 90 రోజులలో అర్హులైన దరఖాస్తుదారునికి ఇంటి స్టలం కేటాయించబడును.
సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.