Navaratnalu

  • Contact us

నిరుద్యోగులకి శుభవార్త | ఈపీఎఫ్‌వో నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌..!

February 25, 2023 by bharathi Leave a Comment

EPFO Recruitment 2023: నిరుద్యోగులకు ఇది శుభవార్తనే చెప్పాలి. కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 577 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు యూపీఎస్సీ షార్ట్‌ నోటిఫికేషన్ లో తెలిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఈవో), అకౌంట్స్‌ ఆఫీసర్‌ (ఏవో) తో పాటు అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ (APFC) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

UPSC EPFO Recruitment 2023 (577 Vacancies Check For All Details)

ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 577 ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. అందులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఈవో)/అకౌంట్స్‌ ఆఫీసర్‌(ఏవో) ఉద్యోగాలు 418, అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ పోస్టులు 159 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఫిబ్రవరి 25 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. మార్చి 17న సాయంత్రం 6గంటలకి ముగుస్తుంది. ఈ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in సందర్శించాలి.

ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. ఈవో/ఏవో ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్లు, ఏపీఎఫ్‌సీ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ల వరకు వయో పరిమితి ఉంటుంది. అలాగే జనరల్‌ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.25 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీబ్ల్యూడీ/మహిళలకు ఫీజు లేదు. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ఉద్యోగులని ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీతో పాటు మిగతా అన్ని వివరాలను మరికొద్ది రోజుల్లో upsc.gov.in / upsconline.nic.in ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Filed Under: Recruitment

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం..

February 23, 2023 by bharathi Leave a Comment

న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 388 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 40 రకాల పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్, మెస్ హెల్పర్, వర్క్స్ అసిస్టెంట్, కుక్, అసిస్టెంట్ రిజిస్ట్రార్… తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 2023 మార్చి 10వ తారీకు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

JNU JUNIOR ASSISTANT RECRUITMENT NOTIFICATION 2023 APPLY ONLINE

పోస్టుల వివరాలు:

మొత్తం పోస్టులు: 388

40 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్- 106, MTS- 79, మెస్ హెల్పర్- 49, స్టెనోగ్రాఫర్- 22, … తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.

వయోపరిమితి:

40 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు:

పోస్టును అనుసరించి పదవ తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఉత్తీర్ణతతో పాటు కొన్ని పోస్టులకు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం:

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

2023 మార్చి 10వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Scheme of Examination

Official Website

Filed Under: Recruitment

TSSPDCL Recruitment 2023 | విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

February 16, 2023 by bharathi Leave a Comment

TSSPDCL తెలంగాణా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపనీ లిమిటెడ్ ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ లైన్ మెన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ పూర్తైనటువంటి వారందరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

tssouthernpower-recruitment-2023-notification

ఖాళీల వివరాలు :

జూనియర్ లైన్ మెన్ : 1553

అసిస్టెంట్ ఇంజినీర్ : 48

TSPDCL Notification 2023 Eligibility

వయస్సు :

TSSPDCL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

జూనియర్ లైన్ మెన్ : 10వ తరగతిలో పాటు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

అసిస్టెంట్ ఇంజినీర్ : ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్

SPDCL Recruitment 2023 Apply Process :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

నోటిఫికేషన్ ప్రకటన తేది : ఫిబ్రవరి 02, 2023

దరఖాస్తుకు ప్రారంభ తేది : ఫిబ్రవరి 16, 2023

దరఖాస్తు లింకులు :

Click here to download నోటిఫికేషన (Notification) 

Click here to apply online


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Recruitment

AP Sachivalayam Recruitment 2023

February 16, 2023 by bharathi Leave a Comment

AP Sachivalayam Recruitment 2023  : ఈ పోస్టు ద్వారా రెండు నోటిఫికేషన్ల కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తున్నాము. మొదటిది AP సచివాలయ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా ఖాళీల ప్రకటనను విడుదల చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఖాళీల ప్రకటన వెలువడింది. ఇందులో అత్యధికంగా పశుసంవర్ధక సహాయకుల పోస్టులన్నాయి. శాఖల వారీగా ఖాళీలను చూద్దాం.

AP Sachivalayam Jobs 2023

పోస్టు పేరు – ఖాళీలు

గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – 57

ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 14

పశుసంవర్ధక సహాయకుడు – 542

పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 78

పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-IV) – 51

విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 60

ఉద్యానవన సహాయకులు – 125

విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 15

విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 03

మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 112

ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 41

విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 30

సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 26

వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 29

వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 31

వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 28

వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 44

వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 17

ఎనర్జ్జీ అసిస్టెంట్ – 09

Detailed notification update here soon.

Filed Under: Recruitment

కడప లో 115 అంగన్‌వాడీ ఉద్యోగాలు | 7వ తరగతి, 10వ తరగతి పాసైన మహిళలు అందరూ అర్హులు | Apply Online

February 7, 2023 by bharathi Leave a Comment

AP Jobs 2023 : అంగన్‌వాడీ కేంద్రాల్లో 115 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది పూర్తి వివరాలు చదివి తెలుసుకోండి మీ సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Applications are invited from eligible candidates for filling 115 Anganwadi Worker, Anganwadi Helper, Mini Anganwadi Worker jobs in Anganwadi Centers. In full details..

ప్రధానాంశాలు:

  • ఏపీ అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్‌ 2023
  • 115 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ప్రకటన
  • ఫిబ్రవరి 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి

anganwadi-jobs

AP:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కడప జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో 115 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. సంబంధిత గ్రామానికి చెందిన వివాహిత మహిళలై ఉండాలి. జులై 1, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి.

పైన పేర్కొన్న అర్హతలున్నవారు 2023, ఫిబ్రవరి 6వ తేదీలోపు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆఫీస్‌లో అందజేయాలి. దరఖాస్తులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవల్సి ఉంటుంది. పదో తరగతి మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.7,000ల నుంచి రూ.11,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌ లేదా https://kadapa.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Recruitment

Recent Posts

  • Arogyasri Card Free Download Online Easy Process
  • YSR Kapu Nestham & YSR Vahana Mithra-2024 Application | వైస్సార్ కాపు నేస్తం & వైస్సార్ వాహన మిత్ర-2024
  • AP Cabinate Decessions-July 2023 | AP కేబినెట్ నిర్ణయం-జూలై 2023
  • AP Government Employees and pensioners 12th PRC Pay Scales | 12th PRC Pay Scales fixation process
  • GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT G.O. Rt. No.675
  • ఎమ్మెల్యే కూతురు, పేద మెకానిక్ కొడుకు సినిమా టైటిల్ కాదు, ప్రొద్దుటూరులో నిజం.
  • DDO List for 61 Srikakulam (District) – 6102 STO – Srikakulam (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2704 PAO – AP Bhavan (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2703 AP State Capital Region Treasury (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2700 Pay & Accounts Office – Andhra Pradesh (Treasury)

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in