Navaratnalu

  • Contact us

Hyderabad Real Estate | సౌత్ ఇండియా రియల్ ఎస్టేట్ ని దున్నేస్తున్న హైదరాబాద్ | లేటెస్ట్ రిపోర్ట్

February 24, 2023 by bharathi Leave a Comment

Hyderabad: తెలంగాణలోని హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్న క్రమంలో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఆదరణ లభిస్తోంది. దేశంలోని చాలా అభివృద్ధి చెందిన నగరాల కంటే భాగ్యనగరం రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారింది. ఇక్కడ పెట్టుబడిపెట్టిన ప్రతి రూపాయి లాభాలను కురిపించటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Hyderabad Real Estate Sees Maximum Housing Units Sale in South India Demand in Few Areas

తాజా రిపోర్ట్స్ ప్రకారం
2022లో దక్షిణ భారతదేశంలో అత్యధిక గృహ విక్రయాలు హైదరాబాద్ నగరంలో నమోదయ్యాయని ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ కంపెనీ PropTiger తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఏకంగా 35,372 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో బెంగళూరు, చెన్నై నగరాలు వెనుకకు నెట్టబడ్డాయి.

పెద్ద ఇళ్లకే ప్రాధాన్యం
విక్రయించబడిన హౌసింగ్ యూనిట్లలో 50% కంటే ఎక్కువ 3BHKలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. దీని తర్వాత 41% గృహ వినియోగదారులు 2BHKలను కొనుగోలు చేశారు. ద్రవ్యోల్బణం కారణంగా 2022 చివరి నాటికి నిర్మాణ వ్యయాలు పెరిగిన తరుణంలో విక్రయించిన యూనిట్లలో అత్యధిక నిర్మాణాల విలువ రూ. కోటి కంటే ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది. రియల్ ఎస్టేట్ డిమాండ్ కారణంగా కొత్త ఇళ్ల ధరలు చదరపు అడుగులకు రూ.5,900-6,100 నుంచి చదరపు అడుగులకు రూ.6,130-6,330కి పెరిగాయి.

ఎక్కువ డిమాండ్
హైదరాబాద్ మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం నగరంలోని తెల్లాపూర్, గుండ్లపోచంపల్లి, కొల్లూరు, పుప్పాలగూడ, కోకాపేట్ ప్రాంతాలు గృహ కొనుగోలుదారులు అత్యంత ఇష్టపడిన ప్రాంతాలుగా నిలిచాయి.

ఉద్యోగాలు
స్నేహపూర్వక వ్యాపార వాతావరణం, మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్ కారణంగా.. నగరంలో ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇది పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుదలకు కారణంగా మారింది. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ పై కూడా ప్రభావం ఉంటుందని Housing.com, PropTiger.com, Makaan.comలో డైరెక్టర్ అండ్ రీసెర్చ్ హెడ్ అంకిత సూద్ తెలిపారు.

Filed Under: Telangana

Hyderabad : పేదలకోసం బస్తీ దవాఖానాలు | మార్చి నుంచి 134 రకాల పరీక్షలు అందుబాటులోకి

February 24, 2023 by bharathi Leave a Comment

Basthi Hospitals: తెలంగాణలోని పేద ప్రజలకోసం తమ ప్రభుత్వం తెచ్చిన ఉత్తమ కార్యక్రమాల్లో బస్తీ దవాఖానాలు ఒకటని మెడికల్ అండ్ హెల్త్ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించేందుకు ముఖ్యమంత్రి KCR దీనిని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఇవి తమ పనితీరుతో ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకుంటున్నాయని హరీష్ రావు తెలిపారు.

Health Minister Harish Rao Talked Over BASTHI Hospital Services Across Telangana as KCR S Dream

ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.800 ఖరీదు చేసే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలను 1.48 లక్షల మంది ప్రజలకు (రూ.12 కోట్ల విలువైన) బస్తీ దవాఖానాల ద్వారా ఉచితంగా చేసినట్లు వెల్లడించారు. వీటికి తోడు 1.8 లక్షల మందికి థైరాయిడ్ పరీక్షలను(రూ.8 కోట్లు విలువైన) చేసినట్లు వెల్లడించారు. బస్తీ దవాఖానాల్లో చికిత్స చేయించుకునే ప్రజలకు ప్రభుత్వం 158 రకాల మందులను ఉచితంగా అందిస్తోందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రజలకు వీటిని చేరువ చేసినందున ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవల కోసం రద్దీ తగ్గిందని తెలిపారు.

2019 సమయంలో ఒస్మానియా జనరల్ ఆసుపత్రికి దాదాపు 12 లక్షల ఓపీ రోగుల తాకిడి ఉండేదని.. ప్రస్తుతం ఇది 5 లక్షలకు తగ్గిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అలాగే గాంధీ ఆసుపత్రిలో సైతం రద్దీ 6.5 లక్షల నుంచి 3.7 లక్షలకు తగ్గిందని అన్నారు. దీని వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు వేగంగా అందటంతో పాటు ప్రధాన ఆసుపత్రులపై రోగుల రద్దీ తగ్గిందని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ బస్తీ దవాఖానాల సేవలను మరింత పెంచాలనే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మార్చి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బస్తీ దవాఖానాల్లో 134 వివిధ రకాల పరీక్షలు అందుబాటులోకి వస్తాయని హరీష్ రావు తెలిపారు. అయితే ప్రస్తుతం కేవలం 57 రకాల పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 496 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా వాటిలో 345 సేవలు అందించటం ప్రారంభించాయి. మిగిలిన 151 కేంద్రాలు మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో తెలిపారు.

హైదరాబాద్ మహానగరంలో బస్తీ దవాఖానా కేంద్రాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. GHMC పరిధిలో 264 కేంద్రాలు సేవలు అందిస్తున్నాయని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. హైదరాబాద్‌ అర్బన్‌లో 36, వివిధ మున్సిపాలిటీల్లో 45 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయని హరీశ్‌రావు తెలిపారు. ఏప్రిల్‌లో అన్ని జిల్లాల్లో కేసీఆర్ పౌష్టికాహార కిట్‌ల పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. 1540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని పేర్కొన్నారు.

Filed Under: Telangana

Telangana: బలహీన వర్గాల అభ్యున్నతికి KCR సర్కార్ ఊతం.. వేల కోట్లు ఖర్చు..

February 24, 2023 by bharathi Leave a Comment

Telangana: తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద వివిధ కార్యక్రమాలకు గడచిన 9 ఏళ్లలో రూ.2,626 కోట్లను ఖర్చు చేసినట్లు సామాజిక-ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది.

Telangana KCR Government Spent 2626 Crores in 9 Years Under Economic Support Schemes

2023-2024 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలు (ఎస్సీలు) కోసం ESS కింద రూ. 100 కోట్లు, షెడ్యూల్ తెగల (ఎస్టీలు) కోసం రూ.323.45 కోట్లను కేటాయించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో పాటు ఇతర బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ESS కార్యక్రమాన్ని రూపొందించటం జరిగింది.

ఈఎస్ఎస్ కింద 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వం మెుత్తంగా రూ.2,029 కోట్లను సబ్సిడీ రూపంలో అందించింది. ఈ డబ్బు వెనుకబడిన తరగులకు చెందిన 1,62,444 మంది లబ్ధిదారులకు ప్రోత్సాహకంగా అందించటం జరిగింది. షెడ్యూల్డ్ కులాల నుంచి పరిశ్రమలు, సేవలు, వ్యాపారం, రవాణా రంగాల్లో ఉన్న వారికి సబ్సిడీ రూపంలో స్కీమ్ ఆర్థిక సహాయాన్ని అందించింది. అలాగే రూ. 460.39 కోట్ల విలువైన సబ్సిడీలు, బీసీ కార్పొరేషన్, అత్యంత వెనుకబడిన తరగతులు, 11 బీసీ ఫెడరేషన్‌ల కింద లబ్ధిదారులకు అందించబడ్డాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్.. గిరివికాసం, గ్రామీణ రవాణా, గిరిజన కళాకారులు, MSMEలు, ST నైపుణ్య శిక్షణతో పాటు ఇతర పథకాల ద్వారా 20,888 షెడ్యూల్ తెగల లబ్ధిదారులకు జీవనోపాధి రంగాల్లో రూ.135.87 కోట్లు వెచ్చించారు. 17,240 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించింది. ఎస్సీ యువతకు శిక్షణ ఇచ్చేందుకు రూ.104.62 కోట్లు వెచ్చించగా.. తర్వాత వారు ప్రముఖ కంపెనీల్లో ఉపాధిని పొందారు.

Filed Under: Telangana

Telangana: డబుల్ బెడ్ రూం స్కీమ్ పై హరీష్ రావు క్లారిటీ | పేదలకు అండగా ఉంటామంటూ

February 24, 2023 by bharathi Leave a Comment

Harish Rao: తెలంగాణలో కొత్తగా ఎలాంటి పన్నులు తీసుకొచ్చే యోచనలో తమ ప్రభుత్వం లేదని ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇటీవల జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో తన కేటాయింపుల ద్వారా నిరూపించారు.

Telangana Finance Minister T Harish Rao Clarified Over Double Bedroom Scheme Along with New Scheme

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టి అనేక మందికి లబ్ధి చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్ తో పాటే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఒక్కసారి ఆర్థిక సాయం అందించే కార్యక్రమం కొనసాగుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

కొత్తగా తీసుకొస్తున్న హౌసింగ్ స్కీమ్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సొంతగా స్థలం ఉండి ఇల్లు కట్టుకుందామనుకునే వారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతంలోని వారికి ఈ స్కీమ్ కింద రూ.5 లక్షలు గ్రాంట్ రూపంలో అందించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాధించింది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం HUDCO నుంచి రూ.12,000 కోట్లను పొందనున్నట్లు తెలిపింది. తాజా బడ్జెట్లో ప్రభుత్వం దీనికి సంబంధించి కేటాయింపులపై ప్రకటన చేసింది.

రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘స్పోర్ట్స్ పాలసీ’ ముసాయిదా సిద్ధమైంది. త్వరలోనే దీనిని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇదే క్రమంలో వేతన సవరణ సంఘం బకాయిలను త్వరలో క్లియర్ చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే మూడు డీఏలు ఇచ్చామన్న హరీష్ రావు.. మిగిలిన డీఏలపై తెలంగాణ కేబినెట్ త్వరలో నిర్ణయం తీసుకోనుందని తెలిపారు.

Filed Under: Telangana

Telangana : రికార్డులు సృష్టిస్తున్న కంటి వెలుగు | 25 రోజుల్లో 50 లక్షల మందికి లబ్ధి

February 24, 2023 by bharathi Leave a Comment

Kanti Velugu: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలను అందిస్తోంది. అయితే గురువారం ఈ ప్రాజెక్టు మరో మైలురాయిని చేరుకుంది. మంచి ప్రజాదరణ పొందిన ఉచిత సామూహిక కంటి స్క్రీనింగ్ ప్రాజెక్ట్ కేవలం 25 రోజుల్లో 50 లక్షల మందికి స్క్రీనింగ్ పూర్తి చేసింది.

Telangana Governments Prestigious Kanti Velugu Achieved 50 Lakhs Milestone In 25 Days

జనవరి 18న ముఖ్యమంత్రి KCR ఖమ్మంలో రెండవ దశ కంటి వెలుగు కార్యక్రామాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 16,533 ప్రాంతాల్లో 1.50 కోట్ల మందికి సేవలను అందించాలని లక్ష్యంగా ఇది కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత కంటి స్క్రీనింగ్ ప్రాజెక్ట్ అయిన కంటి వెలుగు రెండవ దశను జూన్ 15 నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం స్క్రీనింగ్ చేసిన 50 లక్షల మందిలో దాదాపు 34 లక్షల మందికి ఎలాంటి కంటి సమస్యలు లేనట్లు వైద్యులు గుర్తించారు. అంటే దాదాపు 68 శాతం మందికి కంటి చూపులో ఎలాంటి అనారోగ్యాలు గుర్తించలేదు. అయితే 13 లక్షల మందికి వైద్యం అవసరమని తేలింది. ఒకటి రెండు వారాల్లో స్క్రీనింగ్ క్యాంపులు ప్రాథమిక కంటి పరీక్షలు, ఆన్-సైట్ రీడింగ్ గ్లాసెస్ పంపిణీ, సాధారణ కంటి సంబంధిత వ్యాధుల నిర్ధారణ, ప్రిస్క్రిప్షన్ గ్లాసుల పంపిణీని కవర్ చేస్తాయి.

ఇప్పటి వరకు కంటి వెలుగు కింద మొత్తం 9.5 లక్షల మంది రీడింగ్ గ్లాసెస్ పొందారు. వైద్యం అవసరమైన 16 లక్షల మందిలో 6.5 లక్షల మంది ప్రిస్క్రిప్షన్ అద్దాలు పొందినట్లు ప్రాజెక్టు గణాంకాలు చెబుతున్నాయి. సాంకేతిక బృందం సిఫార్సు చేసిన ప్రిస్క్రిప్షన్ గ్లాసులు జిల్లాల్లోని లబ్ధిదారులకు ఆశా, ANMలు వంటి స్థానిక క్షేత్రస్థాయి ఆరోగ్య సంరక్షణ నిపుణుల ద్వారా పంపిణీ చేయబడతాయి.

ప్రజలకు కంటి చూపు సమస్యలను దూరం చేయాలని సీఎం కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు మహాయజ్ఞంలా విజయవంతంగా ముందుకు సాగటంపై లబ్ధిదారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Filed Under: Telangana

  • 1
  • 2
  • 3
  • Next Page »

Recent Posts

  • Arogyasri Card Free Download Online Easy Process
  • YSR Kapu Nestham & YSR Vahana Mithra-2024 Application | వైస్సార్ కాపు నేస్తం & వైస్సార్ వాహన మిత్ర-2024
  • AP Cabinate Decessions-July 2023 | AP కేబినెట్ నిర్ణయం-జూలై 2023
  • AP Government Employees and pensioners 12th PRC Pay Scales | 12th PRC Pay Scales fixation process
  • GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT G.O. Rt. No.675
  • ఎమ్మెల్యే కూతురు, పేద మెకానిక్ కొడుకు సినిమా టైటిల్ కాదు, ప్రొద్దుటూరులో నిజం.
  • DDO List for 61 Srikakulam (District) – 6102 STO – Srikakulam (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2704 PAO – AP Bhavan (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2703 AP State Capital Region Treasury (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2700 Pay & Accounts Office – Andhra Pradesh (Treasury)

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in