Navaratnalu

  • Contact us

వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update

August 9, 2023 by bharathi Leave a Comment

BOP అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 14.8 కు తేదీ ఆగష్టు 8 న అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా వైస్సార్ కళ్యాణ మస్తు / వైస్సార్ షాది తోఫా పెళ్లి కూతురు తల్లుల eKYC తీసుకునే ఆప్షన్ ఇవ్వటం జరుగును.

YSR-Kalyanamasthu-Secretariat-Wise-Abstract

జులై 20 వరకు దరఖాస్తు చేసిన అప్లికేషన్ లకు 3వ విడతకు పరిగణించటం జరుగును.

Inter Caste Marriage, అనర్హుల అప్లికేషన్ లు eKYC కు పుష్ చెయ్యబడలేదు .

అర్హుల, అనర్హుల జాబితా త్వరలో విడుదల చేయటం జరుగును.

Check eKYC Report at : https:// shorturl.at /JMPX0


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: YSR Kalyanamasthu

వైఎస్సార్‌ కల్యాణమస్తు… షాదీ తోఫా పెళ్లికి పెద్ద సాయం | YSR Kalyanamastu… Shaadi Tofa is a big help for marriage

February 16, 2023 by bharathi Leave a Comment

YSR Kalyanamastu… Shaadi Tofa is a big help for marriage

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు సర్కారు సాయం..

4,536 కుటుంబాలకు రూ.38.18 కోట్లు

ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తుల పరిశీలన

కల్యాణమస్తు, షాదీ తోఫా ఆర్థిక సాయం భారీగా పెంపు

ఈ నెల 10వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు భవన నిర్మాణ కార్మికులు, విభిన్న ప్రతిభావంతుల్లో దరఖాస్తు చేసుకున్న 4,536 కుటుంబాలకు ఆర్థిక సాయం కింద రూ.38.18 కోట్లు పంపిణీ చేయనుంది.

గతంతో పోలిస్తే సాయం మొత్తాన్ని భారీగా పెంచింది.

కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కోసం దరఖాస్తు చేసుకునే వధూవరులకు 10వ తర­గతి ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది. గత అక్టోబరు నుంచి డిసెంబరు వరకు జరిగిన వివాహాలకు సంబంధించి అందిన దరఖాస్తులను జనవరిలో తనిఖీ చేసి ఫిబ్రవరిలో ఆర్థిక సాయం చెల్లించనుంది.

ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తులను పరిశీలించి నాలుగో నెలలో లబ్ధి అందించనుంది

Filed Under: YSR Kalyanamasthu

CM Jagan: గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్‌ సర్టిఫికేట్స్‌ | వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు

February 10, 2023 by bharathi Leave a Comment

వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జమ చేశారు. 2022 అక్టోబరు- డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి 4,536 మంది లబ్ధిదారులకు..

kalyanamastu-and-shaadi-tofa

వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జమ చేశారు. 2022 అక్టోబరు- డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్లను బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భరంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అక్టోబరు- డిసెంబర్‌ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెలపాటు సమయం ఇచ్చామని, ఫిబ్రవరిలో వెరిఫికేషన్‌ పూర్తిచేసి, ఇవాళ నేరుగా వారికి నగదు జమచేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరంలో ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఇదే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని, జనవరి- ఫిబ్రవరి- మార్చి నెలలకు సంబంధించి దరఖాస్తులో ఏప్రిల్‌లో స్వీకరిస్తామని, మే నెలలో వారికి అందజేస్తామన్నారు. ఈ పథకం సమూలంగా ఒక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని, పేదవాడి తలరాత మారాలంటే.. చదువు అనే అస్త్రాన్ని ఇవ్వగలిగితేనే తలరాతలు మారుతాయన్నారు సీఎం జగన్‌. పిల్లలను చదివించడానికి పెట్టే ప్రతి రూపాయికూడా ఖర్చుగా భావించడం లేదని, పిల్లలకు ఇచ్చే ఆస్తిగానే భావిస్తున్నామన్నారు. వయసు మాత్రమే కాదు, చదువు కూడా ఒక అర్హతగా ఈపథకానికి నిర్దేశించామని వ్యాఖ్యానించారు.

ఇక పెళ్లైనవారే కాకుండా వారి తర్వాత తరాలు కూడా చదువుల బాట పట్టాలనే ఇది చేస్తున్నామని, పిల్లల చదువులను ప్రోత్సహించడం, బాల్యవిహాహాలను నివారించడం, స్కూళ్లలో డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకం పెట్టామన్నారు. కనీస వయస్సు.. నా చెల్లెమ్మలకు 18 ఏళ్లు, నా తమ్ములకు 21 ఏళ్లు నిర్దేశించాం.. టెన్త్‌ సర్టిఫికెట్‌ కచ్చితంగా ఉండాలని చెబుతున్నామన్నారు.

ఈ ప్రోత్సాహకం కోసం కనీసంగా టెన్త్‌ వరకూ తీసుకున్నామని, తర్వాత అమ్మ ఒడి ఉండటంతో సహజంగానే ఇంటర్మీడియట్‌ చదువుకుంటారు.. ఆ తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు ఉన్నాయి.. అందుకే ఇంటర్మీడియట్‌ నుంచి వారి చదువులు ఆగిపోకుండా ముందుకు కొనసాగుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల్లోని ఆడపిల్లలందరికీ కూడా మంచి జరుగుతుందని, వచ్చే త్రైమాసికం నుంచి కళ్యాణమస్తు, షాదీ తోఫా డబ్బులు పెళ్లికూతురు తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నామని పేర్కొన్నారు. పలువురి సూచనలమేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, పెళ్లిళ్లుకోసం కొంతకాలం ఆగొచ్చు.. కానీ చదువులు ఆగిపోకూడదనేది మా ఉద్దేశమన్నారు.

అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుందని, పదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న ఆలోచనతో మనం అడుగులు ముందుకేస్తున్నామన్నారు. ప్రపంచంలో పోటీ విపరీతంగా ఉంది. మన పిల్లలకు ఎక్కడకు వెళ్లినా.. గెలిచే పరిస్థితి ఉండాలి. అందుకే విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో మెరుగుపరచడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నాం.. అమ్మ ఒడి, సంపూర్ణ పౌష్టికాహారం, విద్యాకానుక, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్‌, నాడు-నేడుతోపాటు, నాడునేడులో చివరి కార్యక్రమం ఆరోతరగతి పైన అన్ని క్లాసుల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌, 8వ తరగతిలోకి రాగానే వారందరికీ ట్యాబ్స్‌, బైజూస్‌ కంటెంట్‌, సీబీఎస్‌ఈ సిలబస్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కోసం విద్యాదీవెన, వసతి దీవెన, ఉద్యోగాలు కల్పించేలా పాఠ్యప్రణాళిక, విదేశాల్లో అత్యుత్తమ కాలేజీల్లో సీట్లు సంపాదించేవారికి రూ.1.25 కోట్ల వరకూ వారికి సహాయాన్ని విదేశీ విద్యాదీవెన ఇస్తున్నామని వివరించారు.

గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్‌ సర్టిఫికేట్స్‌, దరఖాస్తుకు ఏర్పాట్లు:
గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్‌ సర్టిపికేట్స్‌, దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎక్కడా కూడా లంచాలకు, వివక్షకు తావులేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. గతంలో కూడా ఇలాంటి తరహా కార్యక్రమం ప్రకటించారు. కానీ అమలు మాత్రం దారుణంగా ఉండేది. మంచి చేయాలన్న ఆలోచనతో చేసింది కాదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆరోజు తీసుకు వచ్చారు. అరకొరగా డబ్బులు ఇచ్చారు.. అవికూడా పూర్తిగా ఇవ్వలేదని ఆరోపించారు. 2018-19 సంవత్సరంలో 17,709 మంది లబ్ధిదారులకు రూ. 68.68 కోట్లు ఎగ్గొట్టారు. 2018 అక్టోబరు నుంచి పూర్తిగా ఎగ్గొట్టారు. కేవలం ప్రకటనలకే ఆనాడు పథకం పరిమితమైంది. ఎస్సీలకు గతంలో రూ.40వేలు అయితే ఇప్పుడు లక్ష చేశాం.

ఎస్సీలు కులాంతర వివాహాలకు గతంలో రూ.75వేలు ప్రకటిస్తే ఇప్పుడు రూ.1.2లక్షలు చేసి అమలు చేస్తున్నాం. ఎస్టీలకు రూ.50 వేలు గతంలో అయితే.. ఇప్పుడు రూ.1 లక్ష ఇస్తున్నాం. అలాగే ఎస్టీ కులాంతర వివాహాలకు గతంలో రూ.75వేలు అయితే ఇప్పుడు రూ.1.2 లక్షలు ఇస్తున్నాం. బీసీలకు గతంలో రూ.35వేలు అయితే ఇప్పుడు రూ.50 వేలు, బీసీలు కులాంతర వివాహాలకు గతంలో రూ.50వేలు అయితే ఇప్పుడు రూ.75వేలు, మైనార్టీలకు గతంలో రూ.50 వేలు అయితే ఇప్పుడు రూ.1 లక్ష రూపాయలు, విభిన్న ప్రతిభావంతులకు గతంలో రూ.1 లక్ష అని చెప్తే.. ఇప్పుడు రూ.1.5 లక్షలు, భవన, ఇతర కార్మికులకు గతంలో రూ.20వేలు అయితే, ఇప్పుడు రూ.40వేలు ఇస్తున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: YSR Kalyanamasthu

ఫిబ్రవరి 10న వైయస్సార్ కళ్యాణమస్తు / షాదీ తోఫా మొదటి విడత డబ్బులు విడుదల | 2023

February 9, 2023 by bharathi Leave a Comment

YSR Kalyanamastu’ and ‘YSR Shadi Thofa : వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా కి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో ఎవరైతే అప్లై చేసుకున్నారు వారికి శుభవార్త. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వ తేదీన వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా డబ్బులు మొదటిసారిగా విడుదల చేస్తున్నారు. కావున ఎవరైతే అప్లై చేశారో, వారిలో అర్హులైన వారందరికీ ఖాతాలలో ఫిబ్రవరి 10న డబ్బులు జమ కానుంది.

YSR Kalyanamasthu Scheme for Poor Brides Marriage Financial Assistance

ysr-kalyanamastu-shadi-thofa-updates

వైఎస్సార్ కళ్యాణమస్తు కింద

  • SC, ST లకు రూ లక్ష.
  • కులాంతర వివాహం చేసుకున్న SC, ST కు రూ.1.20 లక్షలు
  • BC లకు రూ.50వేలు
  • కులాంతర వివాహం చేసుకున్న BC లకు రూ.75వేలు ఇవ్వనున్నారు.

Important

Name of the Scheme : YSR Kalyanamasthu (వైఎస్సార్ కళ్యాణమస్తు )

Aim of the Scheme : Providing financial Assistance to the BC,SC,ST, Differently abled marriages

Launching date : 1st Oct 2022

Eligibility : BC, SC, STs, Differently-abled poor people meeting the criteria

Benefit of the YSR Kalyanamasthu : Rs 50000  Rs 1.5 Lakhs depending on the criteria

Application process (Where to apply) : Grama / Ward Sachivalyam

వైఎస్సార్ కళ్యాణమస్తు స్కీమ్  :

వైఎస్సార్ కళ్యాణమస్తు స్కీమ్ ని అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు అమలు చేశారు.  

వైఎస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీలకు రూ. లక్ష మేర పెళ్లి కానుక ఇవ్వనున్నారు.

అలాగే కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు లక్షా 20 వేలు.

ఎస్టీల పెళ్లిళ్లకు లక్ష, కులాంతర వివాహం చేసుకుంటే 1.20 లక్షలు.

అలాగే బీసీల పెళ్లిళ్లకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ. 75 వేలు.

అలాగే ప్రతిభావంతులకు వైఎస్సార్ కళ్యాణమస్తు కింద వైఎస్సార్ కళ్యాణమస్తు కింద రూ.1.50 లక్షలు.

వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు.

భవన నిర్మాణ కార్మికులకు రూ.40వేలు ఇవ్వాలని నిర్ణయించారు. 


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

 

Filed Under: YSR Kalyanamasthu

YSR Kalyanamasthu & Shadi Tofa Scheme Benifit Released on 10th February 2023 | ఏపీలో వారికి శుభవార్త.

February 8, 2023 by bharathi Leave a Comment

ఏపీలో వారికి శుభవార్త.. ఈ నెల 10న అకౌంట్‌లోకి డబ్బులు, ఒక్కొక్కరికి రూ.లక్ష అది ఎలాగో అది ఎలాగో చూద్దాం : YSR Kalyanamasthu,  YSR Shadi Tofa డబ్బుల్ని జగన్ సర్కార్ విడుదల చేయనుంది. తేడాది అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య వివాహాలు చేసుకుని అర్హత ఉన్నవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద వివాహం చేసుకుంటే రూ.లక్ష, అదే కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ.లక్షా 20 వేలు.. దివ్యాంగులకు అయితే ఈ పథకం కింద రూ.1.5 లక్షలు ప్రోత్సాహకంగా అందిస్తారు.

YSR Kalyanamasthu 2023

ప్రధానాంశాలు:

  • ఏపీలో మరో పథకానికి డబ్బులు
  • YSR కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు
  • ఈ నెల 10న అకౌంట్‌లలోకి డబ్బులు

ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించబోతోంది. వైఎస్సార్‌ కళ్యాణమస్తు (Ysr Kalyanamasthu), వైఎస్సార్‌ షాదీ తోఫా (Ysr Shadi Tofa) పథకం ఆర్థిక సాయాన్ని ఈనెల 10న ప్రభుత్వం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. గతేడాది అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య వివాహాలు చేసుకుని.. అర్హత ఉన్న వివిధ వర్గాలకు చెందిన యువతులకు ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వైఎస్సార్ కళ్యాణమస్తు.. ముస్లింలకు షాదీ తోఫా పేరుతో పథకం వర్తిస్తుంది.

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ.లక్షా 20 వేలు.. దివ్యాంగులకు అయితే ఈ పథకం కింద రూ.1.5 లక్షలు ప్రోత్సాహకంగా అందిస్తారు. ఇక భర్త చనిపోయిన సందర్భంలో వితంతువుకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆడపిల్లకు మొదటి పెళ్లికి మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుంది. పెళ్లి అయిన 60 రోజుల్లోపు http://gsws-nbm.ap.gov.in ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం అధికారులు దరఖాస్తులను పరిశీలించి.. క్షేత్రస్థాయిలోనూ విచారించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు.

అలాగే రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి అర్హులైన వారు అవసరమైన ధ్రువపత్రాలతో పాటూ ఇతర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలకు తీసుకెళితే.. అక్కడ డిజిటల్‌ అసిస్టెంట్‌(డీఏ)/వార్డు వెల్ఫేర్, డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ (డబ్ల్యూడీపీఎస్‌)లు దరఖాస్తు ప్రక్రియను చేస్తారు. వరుడుకి 21 ఏళ్లు, వధువుకు 18 ఏళ్లు వయస్సు నిండి.. వధూవరులు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉంది. బాల్య వివాహాలను అరికట్టేందుకు, చదువును ప్రోత్సహించడం కోసం పదో తరగతి నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఈ పథకానికి మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు మాత్రమే అర్హులు. పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు, గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు నెలసరి ఆదాయం కలిగిన వారికి మాత్రమే పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబాలకు వర్తించదు. ప్రభుత్వం పారిశుధ్య కార్మిక కుటుంబాలకు మినహాయింపు ఇచ్చింది. ఎవరికైనా సొంతంగా నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు.. ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లున్న వారికి మినహాయింపు ఇచ్చారు. అంతేకాదు విద్యుత్‌ వినియోగం నెలకు 300 యూనిట్లలోపు ఉండాలనే నిబంధన కూడా ఉంది. ఆదాయ పన్ను చెల్లించేవారు కూడా అనర్హులు.. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన నిర్మాణ ఆస్తి ఉండొద్దు.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: YSR Kalyanamasthu

  • 1
  • 2
  • Next Page »

Recent Posts

  • Arogyasri Card Free Download Online Easy Process
  • YSR Kapu Nestham & YSR Vahana Mithra-2024 Application | వైస్సార్ కాపు నేస్తం & వైస్సార్ వాహన మిత్ర-2024
  • AP Cabinate Decessions-July 2023 | AP కేబినెట్ నిర్ణయం-జూలై 2023
  • AP Government Employees and pensioners 12th PRC Pay Scales | 12th PRC Pay Scales fixation process
  • GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT G.O. Rt. No.675
  • ఎమ్మెల్యే కూతురు, పేద మెకానిక్ కొడుకు సినిమా టైటిల్ కాదు, ప్రొద్దుటూరులో నిజం.
  • DDO List for 61 Srikakulam (District) – 6102 STO – Srikakulam (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2704 PAO – AP Bhavan (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2703 AP State Capital Region Treasury (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2700 Pay & Accounts Office – Andhra Pradesh (Treasury)

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in