Andhra Pradesh రాష్ట్ర ప్రభుత్వం మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా (SC, ST, BC, disabled, building and other construction sectors) బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన యువతుల వివాహాలకు వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా ద్వారా ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది. వైఎస్సార్ కల్యాణమస్తు పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన, ఇతర నిర్మాణ రంగాల్లో నమోదైన కార్మికులకు లబ్ధి చేకూరుతుంది.
షాదీతోఫా పథకం ద్వారా ముస్లిం మైనార్టీలకు మేలు కలుగుతుంది. ఈ మేరకు గత ఏడాది అక్టోబర్ 1 తేదీ నుంచి గ్రామ / వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఇప్పటి వరకూ జిల్లాలో 32 దరఖాస్తులు అందాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నారు. అన్ని స్థాయిల్లోనూ సమగ్ర పరిశీలన పూర్తయ్యాక అధికారిక ఆమోదం కోసం కలెక్టర్‌కు ఈ దరఖాస్తులు పంపుతారు.
Application process (దరఖాస్తు ప్రక్రియ) : వివాహం జరిగిన 60 రోజుల్లోగా మీరూ మీ గ్రామ / వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మొదట మీరూ మీ గ్రామ / వార్డు సచివాలయం ద్వారా వివాహ సర్టిఫికెట్ పొందాలి. అనంతరం నిబంధనల మేరకు వివాహ ధ్రువపత్రాలను దరఖాస్తులో పొందుపర్చాలి. ముఖ్యంగా పెళ్లిపత్రిక, పెళ్లి సమయంలో తీయించిన ఫొటోలు, మ్యారేజ్ సర్టిఫికెట్, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతా జిరాక్స్ సమర్పించాలి. వధూవరుల చదువుకు సంబంధించి పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ల జిరాక్సు కూడా దరఖాస్తుకు జత చేయాలి. మీరు భవన నిర్మాణ కార్మికులు అయితే, భవన నిర్మాణ కార్మికులు సభ్యత్వ ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాలి. ఈ పథకాలపై వైఎస్సార్ క్రాంతిపథం సిబ్బంది తమ పరిధిలోని సంఘాల సభ్యుల ద్వారా ఇప్పటికే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
పథకానికి ఉండవలసిన అర్హతలు ఇవే
వివాహమయ్యేనాటికి వరుడికి 21, వధువుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
భర్త చనిపోయిన స్త్రీ రెండో పెళ్లి చేసుకున్నా అర్హురాలే
వధూవరులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
కుటుంబ ఆదాయం నెలకు పల్లెల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించకూడదు
భూమి పల్లం 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు లేదా రెండూ కలిపి 10 ఎకరాలు మించకూడదు
కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్‌దారు అయ్యి ఉండకూడదు
పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది
కారు ఉండరాదు. ఆటో, ట్రాక్టర్, ట్యాక్సీకి మినహాయింపు ఉంది
కుటుంబం నెలవారీ విద్యుత్ వాడకం 300 యూనిట్లు మించరాదు
మున్సిపల్ ప్రాంతంలో 1000 ఎస్ఎఫ్టీకి మించి నివాస స్థలం ఉండరాదు
- These are the eligibility criteria for YSR Kalyanamasthu / Shaadi Tohfa scheme
- The groom should be 21 years old and the bride 18 years old at the time of marriage
- A woman whose husband has died is eligible for second marriage
- The bride and groom must have passed at least 10th standard
- Family income should not exceed Rs.10 thousand in rural areas and Rs.12 thousand in urban areas per month
- Bhumi pallam 3 acres, metta 10 acres or both together not exceeding 10 acres
- No one in the family should be a government employee or pensioner
- There is an exemption for families of sanitation workers
- No car. Auto, tractor, taxi are exempted
- The monthly electricity consumption of the family should not exceed 300 units
- Residential area should not exceed 1000 SFT in municipal area
YSR Kalyanamasthu / YSR Shaadi Tohfa Benifits – Marriage Category wise
The financial assistance is to be provided as mentioned below
S No | Marriage Category | Benefit Amount (Rs) |
1 | Scheduled Caste (SC) | 1,00,000/- |
2 | Scheduled Caste (SC) Inter Caste | 1,20,000/- |
3 | Scheduled Tribe (ST) | 1,00,000/- |
4 | Scheduled Tribe (ST) Inter Caste | 1,20,000/- |
5 | Backward Classes (BC) | 50,000/- |
6 | Backward Classes (BC) Inter Caste | 75,000/- |
7 | Minorities | 1,00,000/- |
8 | Differently Abled | 1,50,000/- |
9 | BOCWWB Member | 40,000/- |
YSR Kalyanamsthu_User manual v6.0
YSR Kalyanamasthu /YSR Shaadi Tohfa 2022-23 WEA / WWDS Field Verification Form
G O Ms No 50 SW(Edn) Dept dated 30-09-2022
ysr-kalyanamastu-go
Click here to download వైఎస్సార్ కళ్యాణస్తు యూజర్ మాన్యువల్ (వెర్షన్v6.0)
Click here to download వైఎస్సార్ కళ్యాణమస్తు /YSR షాదీ తోఫా 2022-23 WEA / WWDS ఫీల్డ్ వెరిఫికేషన్ ఫారమ్
Click here to download G O Ms No 50 SW(Edn) విభాగం తేదీ 30-09-2022
Click here to download వైఎస్ఆర్ కళ్యాణమస్తు జీవో (GO)
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.