కొత్తగా ‘లా’ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరపడేవరకు 3 సంవత్సరాల పాటు నెలకు రూ 5 వేలు ప్రభుత్వ ఆర్ధిక సాయం
YSR Law Nestham 2023 Online Apply & Status Check | వైఎస్ఆర్ లా నేస్తం | Rs.5000/- Stipend to Jr. Advocates
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్తపథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులకు శుభవార్త అందించింది. వృత్తిలోకి కొత్తగా ప్రవేశించే న్యాయవాదులకు వైయస్సార్ లా నేస్తం పేరుతో నెలకు రూ.5వేల చొప్పున స్టైఫండ్ ఇచ్చేందుకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద ప్రాక్టీసులో ఉండే జూనియర్ న్యాయవాదులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలవారీ స్టైపెండ్ అందిస్తుంది. లా నేస్తం పథకం ద్వారా జూనియర్ లాయర్లకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్ సమయంలో మూడేళ్ల పాటు అందిస్తారు.
స్కాలర్షిప్ పేరు : వైఎస్ఆర్ లా నేస్తం
స్కాలర్షిప్ టైప్ : ఫైనాన్సియల్ అసిస్టెన్స్
ఎవరికి అందిస్తారు : జూనియర్ లాయర్లకు
అర్హుత : 35 ఏళ్ల లోపు వయస్సు & తొలి మూడేళ్ల ప్రాక్టీసులో ఉండాలి
వైఎస్ఆర్ లా నేస్తం పథకానికి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడు పేరు రాష్ట్ర బార్ కౌన్సిల్ సెక్షన్ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి.
వైఎస్ఆర్ లా నేస్తం పథకం జూనియర్ లాయర్లకు ప్రాక్టీసు సమయంలో ఆర్థిక తోడ్పాటును అందివ్వనుంది. ఈ పథకం కుటుంబంలో ఒక వ్యక్తికీ మాత్రమే అందిస్తారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సెక్షన్ ఎన్‌రోల్‌మెంట్ ధ్రువపత్రాన్ని పరిగణలోకి తీసుకొని మొదటి మూడేళ్లను లెక్కిస్తారు. జీవో జారీ చేసే నాటికి జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించి మూడేళ్లు నిండనివారు మిగిలిన కాలానికి మాత్రమే స్టైఫండ్ పొందుతారు.
ఏం అవసరం… – దరఖాస్తుదారు తాను ఇంకా ప్రాక్టీస్‌లోనే ఉన్నానని పదిహేనేళ్ల అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాది లేదా సంబంధిత బార్ అసోసియేషన్ లేదా సంబంధిత కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ల నుంచి అఫిడవిట్ సమర్పించాలి. – న్యాయవాదిగా నమోదైన తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, రెండేళ్ల లోపు సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్‌ను సమర్పించాలి.
వైఎస్ఆర్ లా నేస్తం ఎలిజిబిలిటీ
- వైఎస్ఆర్ లా నేస్తం పథకానికి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
- అభ్యర్థులు 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
- దరఖాస్తుదారు పేరు రాష్ట్ర బార్ కౌన్సిల్ సెక్షన్ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి.
- మూడేళ్ళ ప్రాక్టీస్ పూర్తిచేసినవారు, సొంత నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సెక్షనులో రిజిస్టర్ చేసుకొని వారు ఈ పథకానికి అనర్హులు.
- దరఖాస్తుదారుడు తాను ఇంకా ప్రాక్టీస్‌లోనే ఉన్నానని పదిహేనేళ్ల అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాది లేదా సంబంధిత బార్ అసోసియేషన్ లేదా సంబంధిత కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ల నుంచి అఫిడవిట్ సమర్పించాలి.
వైఎస్ఆర్ లా నేస్తం దరఖాస్తు
అర్హుత ఉన్న అభ్యర్థులు లా నేస్తం అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అందివ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు సామజిక వెరిఫికేషన్ కోసం గ్రామ/వార్డు వాలంటీర్లకు పంపిస్తారు. వెరిఫికేషన్‌లో దరఖాస్తు సరైనదేనని తేలితే, దానిని పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, ఆతర్వాత జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు.
కలెక్టర్ల ఆమోదం పొందిన అనంతరం ఆ దరఖాస్తును మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు సీఎప్ఎంఎస్ యందు అప్లోడ్ చేస్తారు. సోషల్ ఆడిట్ కోసం ఆ దరఖాస్తును గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ప్రదర్శిస్తారు. ఈ దశలన్నీ పూర్తిచేసుకుని తుది ఆమోదం పొందిన వారి అకౌంట్లలో సొమ్మును జమ చేస్తారు. గ్రామ లేదా వార్డు వాలంటీర్లు స్టైఫండ్ చెల్లింపు రసీదును లబ్ధిదారు ఇంటివద్ద అందిస్తారు.
Online Apply at : https:// ysrlawnestham.e-pragati.in/#/
వీరు అనర్హులు :
- నాన్ ప్రాక్టీస్ లాయర్లు
- మూడేళ్ల ప్రాక్టీస్ పూర్తి చేసినవారు
- ఫోర్ వీలర్ కలిగిన వారు
- 35 ఏళ్లు నిండకూడదు
న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకొని, న్యాయవాదిగా, ప్రాక్టీస్ చేయకుండా ఇతర ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా అనర్హులు.
YSR LAW NESTHAM Status Check
Click on above image for checking status online
Downloads
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
జూనియర్ లాయర్లకు జగన్ గుడ్‌న్యూస్ | ఫిబ్రవరి నెలలో లా నేస్తం డబ్బులు రూ.5000/- జమ
మొదటిసారిగా ఎవరైతే అర్హత కలిగిన జూనియర్ లాయర్లు లా నేస్తం కి అప్లై చేసుకున్నారో, మీ అందరి బ్యాంక్ అకౌంట్ లో ఫిబ్రవరి నెలలో రూ.5000/- జమవుతాయి. కరెక్ట్ డేటు ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ ఫిబ్రవరి నెలలో అయితే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం లా నేస్తం డబ్బులు మంజూరు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా 1970 మందికి లా-నేస్తం డబ్బులు రూ.5000/- ఫిబ్రవరి నెలలో జమ చేయనుంది. కావున ఈ పథకానికి అప్లై చేసిన వారందరూ మీ అర్హతను మీ గ్రామంలో లేదా వార్డు సచివాలయాల్లో వెళ్లి చెక్ చేసుకోండి.
లా నేస్తం గురించి : జూనియర్ లాయర్ గా వారు ప్రాక్టీస్ పొందే టప్పుడు వారు ఆర్థికంగా ఇబ్బంది పడతారని రాష్ట్ర ప్రభుత్వం లా నేస్తం అనే పథకాన్ని ప్రారంభించింది. అలాంటి వారికి ఒక మూడు సంవత్సరాల వరకు అంటే వాళ్లకి ఎక్స్పీరియన్స్ వచ్చేంతవరకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి నెల వారి అకౌంట్లో జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మొత్తం అప్లై చేసుకున్న వారి సంఖ్య : 2524
వెరిఫికేషన్ పూర్తి అయిన వారి సంఖ్య : 2232
జిల్లా పేరు | దరఖాస్తు దారుల సంఖ్య |
అనంతపురం | 109 |
చిత్తూరు | 100 |
వైఎస్ఆర్ కడప | 101 |
తూర్పు గోదావరి | 187 |
గుంటూరు | 339 |
కృష్ణుడు | 299 |
కర్నూలు | 205 |
SPSR నెల్లూరు | 117 |
ప్రకాశం | 158 |
శ్రీకాకుళం | 67 |
విశాఖపట్నం | 223 |
విజయనగరం | 42 |
పశ్చిమ గోదావరి | 160 |
నా నేస్తానికి అప్రూవ్ అయిన వారి సంఖ్య : 2085
నా నేస్తం డబ్బులు మంజూరు చేయబడిన వారి సంఖ్య : 1970
- అనంతపురం : 105
- చిత్తూరు : 92
- వైఎస్ఆర్ కడప : 85
- తూర్పు గోదావరి : 176
- గుంటూరు : 313
- కృష్ణుడు : 288
- కర్నూలు : 197
- SPSR నెల్లూరు : 107
- ప్రకాశం : 144
- శ్రీకాకుళం : 64
- విశాఖపట్నం : 210
- విజయనగరం : 39
- పశ్చిమ గోదావరి : 150
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.