There are total 18 useful points for YSR Pelli Kanuka Scheme, please read all of them mentioned below.
YSR పెళ్లి కానుక పథకం కోసం మొత్తం 18 ఉపయోగకరమైన పాయింట్లు ఉన్నాయి, దయచేసి క్రింద పేర్కొన్న అన్నింటినీ చదవండి.
1. పథకం ఉద్దేశ్యం:
పేద కుటుంబాల లోని వధువులకు వివాహ ప్రోత్సాహం అందించడం ద్వారా ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం, ఆడపిల్లలకు ఆత్మస్థైర్యం కల్పించడం మరియు వివాహాలు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వివాహ భద్రత కల్పిచడం
2. పథకం ప్రారంభం :
వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పెళ్లి కానుక పధకాలను అన్నింటినీ ఒక వేదిక పైకి తీసుకు వచ్చి 20.4.2018 నాడు పధకం ప్రారంభించబడినది.
3. ప్రయోజనాలు:
వివాహాల వివరాలు అన్నీ డిజిటలైజేషన్ కాబడతాయి.
“ఏది ఎక్కువ అయితే అది” ప్రాతిపదికన వివాహ ప్రోత్సాహం లబ్దిదారుకు అందుతుంది.
నకిలీ నమోదులు (డూప్లికేట్/డబుల్‌్ జరగటానికి అవకాశం ఉండదు.
వివాహ ద్రువీకరణ విడుదల ద్వారా వివాహానికి చట్టబద్దత కలుగుతుంది.
వివాహ ప్రోత్సాహం నేరుగా వధువు బ్యాంకు ఖాతాకు జమ చేయబడుతుంది.
4. నమోదు కేంద్రాలు :
వెలుగు మండల మహిళా సమాఖ్యల ద్వారా మరియు పట్టణాలలో మెప్మా కార్యాలయాలలో నమోదు చేసుకోవచ్చు
5. నమోదు చేసుకోడానికి అర్హతలు
వివాహ తేదీ నాటికి వధువు వయసు 18 సంవత్సరాలు, వరుడి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
వధువు తప్పని సరిగా తెల్ల రేషన్ కార్డ్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి. (అంటే బి.పి.ఎల్ కుటుంబం)
వరుడు బి.పి.ఎల్ కుటుంబానికి చెంది ఉండ వలసిన అవసరం లేదు, వరుడు ప్రభుత్వ ఉద్యోగి అయినా అర్హులే.
వరుడు తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్, కర్నాటక మరియు పాండిచ్చేరి కి చెందిన యానాం జిల్లాకు చెందిన వారై ఉన్నా కూడా అర్హులే, కానీ వధువు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారై ఉండాలి. (పి.ఎస్.ఎస్ లో నమోదై ఉండాలి),
వివాహం ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే జరగాలి.
మొదటి వివాహం జరిగే వారు మాత్రమే అర్హులు (వితంతువులు తప్ప)
నమోదు చేసుకునే సమయానికి వివాహ వేదిక. వివాహ సమయం నిర్ణయించబడి ఉండాలి,
వివాహ తేదీకి కనీసం 5 రోజుల ముందు నమోదు చేసుకోవాలి.
6. నమోదుకు కావలసిన పత్రాలు, పత్రాల ద్వారా నిర్ధారించే అంశాలు:
1) కావలసిన పత్రాలు : వధువు, వరుడు మరియు వారి తల్లితండ్రులు లేక సంరక్షకుల ఆధార్ కార్డ్‌లు
- నిర్ధారణ చేసే అంశము : ఆధార్ కార్డ్ ల ఆధారంగా వారి పేరు, తండ్రి/సంరక్షుల పేరు తీసుకోబడుతుంది.
2) కావలసిన పత్రాలు : వధువు మరియు వరుడి “మీ సేవా ఇంటిగ్రేటెడ్” సర్దిఫికేట్ లు (పుట్టిన తేదిమరియు కులము తప్పని సరిగా సర్టిఫికేట్‌లో ఉండాలి
- నిర్ధారణ చేసే అంశము : మీ సేవా సర్టిఫికేట్ ద్వారా వధువు, వరుడి కులములు, వారి వయస్సు నిర్థారించ బడతాయి.
3) కావలసిన పత్రాలు : ఎస్.ఎస్.సి చదివిన వారు అయితేఎస్.ఎస్.సి సర్టిఫికేట్
- నిర్ధారణ చేసే అంశము : ఎస్.ఎస్.సి చదివిన వారు అయితే ఎస్.ఎస్.సి సర్టిఫికేట్ లో ఉన్న పుట్టిన తేది ద్వారా వయస్సు నిర్ధారించ బడుతుంది.
4) కావలసిన పత్రాలు : వధువు రేషన్ కార్డు — ( తెల్ల రేషన్ కార్డు | లేని వధువులు మీ సేవా ద్వారా విడుదల అయిన ఆదాయ ద్రువీకరణను సమర్పించవచ్చు).
- నిర్ధారణ చేసే అంశము : వధువు బి.పి.ఎల్ కుటుంబానికి చెందిన వారా కాదా చెక్ చేయబడుతుంది. (రేషన్ కార్డు వివరాలు పౌర సరఫరాల శాఖ డేటా బేస్ లో తప్పని సరిగా ఉండాలి)
5) కావలసిన పత్రాలు : విభిన్న ప్రతిభా వంతులు అయితే సదరం సర్టిఫికేట్
- నిర్ధారణ చేసే అంశము : సదరం సర్టిఫికేట్ లో అర్హతను బట్టి వారికి వికలాంగుల వివాహ ప్రోత్సాహం నిర్ణయించబడుతుంది.
6) కావలసిన పత్రాలు : ఆం. ప్ర. భవన & ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు సభ్యులు అయితే — రిజిస్టేషన్ కార్డు
- నిర్ధారణ చేసే అంశము : ఆం. ప్ర. భవన & ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు సభ్యత్వ నిర్ధారణ జరుగుతుంది.
7) కావలసిన పత్రాలు : వరుడు తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్, కర్నాటక మరియు పాండిచ్చేరికి చెందిన యానాం జిల్లా కు చెందిన వారైతే వారి అడ్రస్ ప్రూఫ్, వారి వయస్సు నిర్ధారణ పత్రము మరియు వారికి ఇది మొదటి వివాహమే అనే వ్యక్తిగత ధృవీకరణ పత్రం సమర్పించాలి
- నిర్ధారణ చేసే అంశము : వరుడి వయస్సు, చిరునామా, మొదటి వివాహ వివరాలు నిర్ధారణ జరుగుతుంది.
8) కావలసిన పత్రాలు : వివాహ పత్రిక
- నిర్ధారణ చేసే అంశము : వివాహం ఆంధ్ర ప్రదేశ్ లోనే జరుగుతున్నదా, వివాహ వేదిక, తేది, సమయం నిర్ధారించబడతాయి.
9) కావలసిన పత్రాలు : వధువు సేవింగ్స్ బ్యాంకు ఖాతా స్కాన్ కాపీ, వివరాలు
- నిర్ధారణ చేసే అంశము : వధువు ఆధార్ కు సీడ్ అయిన వధువు పేరు మీద ఉన్న సేవింగ్స్ బ్యాంకు ఖాతాకు వివాహ ప్రోత్సాహం విడుదల చేయడానికి అనుసంధానం చేయబడుతుంది.
7. వై.ఎస్.ఆర్ పెళ్లి కానుక ప్రోత్సాహకాలు
క్రమ సంఖ్య – వై.ఎస్.ఆర్ పెళ్లి కానుక -యస్ డి క్రింద పధకం పేరు – ప్రస్తుతం అమలు లో ఉన్న వివాహ ప్రోత్సాహక మొత్తం (రూ.లలో)
1 – వైయస్.ఆర్.పెళ్లి కానుక (గిరిపుత్రిక) – 50000
2 – వైయస్.ఆర్.పెళ్లి కానుక (యస్.టి. కులాంతర వివాహం) – 75000
3 – వై.యస్.ఆర్. పెళ్లి కానుక (యస్.సి) – 40000
4 – వై,యస్.ఆర్.పెళ్లి కానుక (యస్.సి. కులాంతర వివాహం) – 75000
5 – వై.,యస్.ఆర్.పెళ్లి కానుక (దుల్లన్) – 50000
6 – వై,యస్.ఆర్.పెళ్లి కానుక (బి.సి) – 35000
7 – వై,యస్.ఆర్.పెళ్లి కానుక (బి.సి కులాంతర వివాహం) – 50000
8 – వైయస్.ఆర్.పెళ్లి కానుక (విభిన్న ప్రతిభా వంతులు ) – 100000
9 – వైైయస్.ఆర్.పెళ్లి కానుక (ఆం. ప్ర. భవన & ఇతర నిర్మాణ కార్మికుసంక్షేమ బోర్డు సభ్యులు ) మరియు (ఆం.ప్ర. కార్మికుల సంక్షేమ మండలి సభ్యులు)
I. యస్.టి. అయితే – 50000
II. యస్.సి. అయితే – 40000
III. బి.సి. అయితే – 35000
IV. ఒ.సి. అయితే – 20000
వరుడు తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్, కర్నాటక మరియు పాండిచ్చేరి కి చెందిన యానాం జిల్లాకు చెందిన వారైతే — వివాహ ప్రోత్సాహం వధువు యొక్క కులమును బట్టి నిర్ణయించ బడుతుంది. వీరికి కులాంతర వివాహ ప్రోత్సాహం వర్తించదు.
8. నోడల్ శాఖ :
సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ శాఖగా వ్యవహరిస్తున్నది.
9. భాగస్వామ్య శాఖలు/బోర్డ్ లు :
సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ . భవన & ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు, ఆంధ్ర ప్రదేశ్ కార్మిక సంక్షేమ బోరు.
10. అమలు సంస్థలు:
గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (19 58ళ్సూ మరియు పట్టణ ప్రాంతాలలో పట్టణ పేదరిక నిర్మూలనా సంస్ధ వకు సంస్థలు అమలు సంస్థలు.
11. అమలు విధానం:
12.గ్రామ పంచాయితీల/వార్డుల కేటాయింపు
గ్రామీణ ప్రాంతాలలో మండలానికి ఇద్దరు చొప్పున, పట్టణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి ఇద్దరు నుండి ముగ్గురు కళ్యాణ మిత్రలు ఉన్నారు. ఆ మండలంలో ఉన్న గ్రామ పంచాయితీలు/వార్డులు వారికి కేటాయించబడి వారి ఆధార్ వివరాలకు లింక్ చేయబడతాయి. వారికి కేటాయించబడిన జి.పి/వార్డులలో క్షేత్ర పరిశీలన వారే చేస్తారు. ఒక్కొక్క ఫీల్డ్ వెరిఫికేషన్ కు రూ.300/- చొప్పున ఫీజు చెల్లించ బడుతుంది.
గ్రామీణ ప్రాంతాలలో కళ్యాణ మిత్ర స్వంత గ్రామ పంచాయితీలో జరిగే వివాహాలకు హాజరు అవుతారు, మిగిలిన ప్రతి జిపి కి ఒక గ్రామ సంఘం సహాయకులు (వి.ఓ.ఎ) ఉన్నారు. వీరు వారి గ్రామ పంచాయితీలో జరిగే వివాహాలకు వివాహ పరిశీలన (మ్యారేజ్ వెరిఫికేషన్) చేస్తారు. పట్టణ వార్డులలో జరిగే వివాహాలకు అక్కడి కళ్యాణ మిత్రలే హాజరు అవుతారు, వి.ఓ.ఎ లు ఉండరు.
ఉదయం 9.00 గంటల నుండి రాత్రి 7.00 గంటల వరకూ జరిగే వివాహ పరిశీలనలకు రూ.250/- లు చొప్పున రాత్రి 7.00 గంటల నుండి ఉదయం 9.00 గంటల వరకూ జరిగే వివాహ పరిశీలన లకు రూ. 500/- చొప్పున ఫీజు చెల్లించ బడుతుంది.
13) క్షేత్ర పరిశీలన:
నమోదు అయిన ప్రతి వధువు/వరుడి వివరాలు ఆ గ్రామ పంచాయితీ కేటాయించబడిన కళ్యాణ మిత్రల ట్యాబ్ లకు పంపబడతాయి. ప్రతి ఒక్క వధువు/వరుడి వివరాలు తప్పని సరిగా క్షేత్ర పరిశీలన (ఫేల్డ్ వెరిఫికేషన్స్ చెయ్య బడతాయి.
కళ్యాణ మిత్ర వధువు/వరుడి ఇంటి వద్దకు వెళ్లి నమోదు సమయంలో ఇచ్చిన సర్టిఫికేట్ ల వివరాలు పరిశీలిస్తారు. వారి బయో ఆథ్ తీసుకుంటారు మరియు వధువు/వరుడి ఫోటో తీస్తారు.
తల్లి లేదా తండ్రి లేదా (తల్లి తండ్రి జీవించి లేని వారికి లేదా అందుబాటు లో లేని వారికి ) గార్డియన్ బయో ఆథ్ తీసుకుంటారు.
వధువు/వరుడికి ఇది మొదటి వివాహమా కాదా, వివాహం యదార్ధంగా జరుగుతున్నదా లేదా అనే వివరాలు ఇరుగు/పొరుగు వారిని అడిగి ద్రువీకరిస్తారు, వారి బయో ఆథ్ తీసుకుంటారు.
వివాహ వేదిక, వివాహ సమయం, సరియైనవి సమర్పించారా లేదా అనేది పరిశీలిస్తారు.
చివరిగా పైన సేకరించిన వివరాలు యదార్హమా కాదా అనే విషయాలు ద్రువీకరిస్తారు.
14.వివాహ ప్రోత్సాహం 20% విడుదల
కళ్యాణ మిత్ర వధువు/వరుడి యొక్క క్షేత్ర పరిశీలన పూర్తి చేసిన తరువాత వారి సర్టిఫికేట్ ల వివరాలు, ఫోటోలు పరిశీలించి సరియైనవి అని నిర్ధారించిన వాటికి వివాహ ప్రోత్సాహం 20% విడుదల చేయబడతాయి.
వివాహ ప్రోత్సాహం మొత్తంలో 20% వధువు సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయబడుతుంది.
వివరాలు ఎస్.ఎమ్.ఎస్.ద్వారా మరియు గౌరవ ముఖ్య మంత్రి వారి లేఖ ద్వారా లబ్దిదారులకు తెలియ చేయ బడతాయి.
15. వివాహం పరిశీలన:
వివాహం సమయానికి కళ్యాణ మిత్ర/గ్రామ సంఘం సహాయకులు హాజరయి వధువు ఫోటో, వరుడి ఫోటో మరియు ఇద్దరూ కలిసి ఉన్న పెళ్లి ఫోటో అంటే మొత్తం 3 ఫోటోలు తీస్తారు.
గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్ వారి శుభాకాంక్షలు చదివి వధూ వరులకు అందచేస్తారు.
వివాహ ఫోటోలు వెలుగు మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్ గారి లాగిన్ లో పరిశీలించబడిన తరువాత వివాహ అధికారి గారి లాగిన్ కు పంప బడతాయి.
16. వివాహ ప్రోత్సాహం 80% విడుదల:
వెలుగు మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్ లాగిన్ లో వివాహ ఫోటోలు పరిశీలించి, నిర్ధారించిన తరువాత వివాహ ప్రోత్సాహం మొత్తంలో మిగిలిన 80% వధువు సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయ బడుతుంది.
వివరాలు ఎస్.ఎమ్.ఎస్.ద్వారా మరియు గౌరవ ముఖ్య మంత్రి వారి లేఖ ద్వారా తెలియ చేయబడతాయి.
17. వివాహ సర్టిఫికేట్:
వెరిఫికేషన్ చేసిన పెళ్లి మరియు వివరాలు వివాహ అధికారి లాగిన్ లోకి వెళతాయి.
వివాహ అధికారి పెళ్లి వివరాలను విచారణ చేసి (ఆ౦౪410%) తమ ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన వాటికి వివాహ ద్రువీకరణ పత్రం విడుదల అవుతుంది. ఒక వేళ వివాహ అధికారి తిరస్కరిస్తే, సర్టిపికేట్ విడుదల కాదు.
వివాహ ప్రోత్సాహం విడుదల చేసిన గౌరవ ముఖ్య మంత్రి వారి లేఖ తో పాటుగా విడుదల అయిన
వివాహ ద్రువీకరణ పత్రం కూడా వధువుకు పంపబడతాయి.
18. అమలు లో వస్తున్న ఇబ్బందులు:
దరఖాస్తు దారులకు అవగాహన లేక పోవడం వలన వివాహ తేదికి 10 రోజుల ముందు దరఖాస్తు చేసుకోక పోవడం.
నమోదు సమయానికి కావలసిన సర్టిఫికేట్ లు, వదువు బ్యాంకు ఖాతా లు లేక పోవడం.
వధువు ఆధార్ కు సీడ్ అయిన బ్యాంకు ఖాతా కాకుండా వేరే బ్యాంకు ఖాతా వివరాలు నమోదు సమయం లో సమర్పించడం.
చిరునామా, ఫోన్ నెంబర్, వివాహ వేదిక, సమయం సరిగ్గా నమోదు చేయించుకోక పోవడం, మార్పులు జరిగితే వెంటనే తెలియ చేయక పోవడం
వై.ఎస్.ఆర్.పెళ్లి కానుక చేయ వలసిన పనులు — చేస్తున్న వారు
క్రమ సంఖ్య : 1
చెయ్య వలసిన పని : పెళ్లి కానుక రిజిస్ట్రేషన్
ప్రస్తుతం చేస్తున్న వారు : వెలుగు మండల సమాఖ్య అకౌంటెంట్/మెప్మా డేటా ఎంట్రీ ఆపరేటర్
స్థాయి : మండల/మునిసిపాలిటి స్థాయి
క్రమ సంఖ్య : 2
చెయ్య వలసిన పని : వధువు/వరుడి వివరాల పరిశీలన (ఫేల్డ్ వెరిఫికేషన్)
ప్రస్తుతం చేస్తున్న వారు : కళ్యాణ మిత్ర
స్థాయి : వధువు/వరుడి నివాసం (గ్రామ స్థాయి)
క్రమ సంఖ్య : 3
చెయ్య వలసిన పని : 20% వివాహ ప్రోత్సాహం వధువు ఖాతా కు జమ చేయడం
ప్రస్తుతం చేస్తున్న వారు : సెర్ప్
స్థాయి : రాష్ట్ర స్థాయి
క్రమ సంఖ్య : 4
చెయ్య వలసిన పని : వివాహ పరిశీలన (మ్యారేజ్ వెరిఫికేషన్)
ప్రస్తుతం చేస్తున్న వారు : కళ్యాణ మిత్ర/వి.ఓ.ఎ
స్థాయి : వివాహం జరిగే ప్రదేశం (గ్రామ స్థాయి)
క్రమ సంఖ్య : 5
చెయ్య వలసిన పని : పెళ్లి ఫోటోలు ఆన్ లైన్ లాగిన్ లో పరిశీలించి అనుమతి ఇవ్వడం లేక తిరస్కరించడం
ప్రస్తుతం చేస్తున్న వారు : వెలుగు మండల సమాఖ్య అకౌంటెంట్/మెప్మా డేటా ఎంట్రీ ఆపరేటర్
స్థాయి : మండల/మునిసిపాలిటి స్థాయి
క్రమ సంఖ్య : 6
చెయ్య వలసిన పని : 80% వివాహ ప్రోత్సాహం వధువు ఖాతా కు జమ చేయడం
ప్రస్తుతం చేస్తున్న వారు : సెర్ప్
స్థాయి : రాష్ట్ర స్థాయి
క్రమ సంఖ్య : 8
చెయ్య వలసిన పని : మ్యారేజ్ సర్టిఫికేట్ విడుదల
ప్రస్తుతం చేస్తున్న వారు : గ్రామ పంచాయితీ కార్యదర్శి/మున్సిపల్ కమీషనర్
స్థాయి : గ్రామ పంచాయితీ స్థాయి /మున్సిపాలిటీ స్తాయి
గమనిక: వధువు బ్యాంకు ఖాతా తప్పని సెర్ప్ వారు రిజెక్ట్ చేస్తే మరలా తెప్పించి ఎడిట్ చేయడం పెళ్లి కానుక విడుదల చేసాక ఏ కారణం చేత అయినా బ్యాంకు నుండి రిజెక్ట్ అయితే వధువు బ్యాంకు ఖాతా వివరాలు తెప్పించి సెర్చ్ కు పంపడం, ఎమ్.ఎస్.అకౌంటెంట్/ డేటా ఎంట్రీ ఆపరేటర్ లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసినందుకు, తరువాత పర్యవేక్షణకు గాను, ఒక రికార్డ్ కు రూ. 150/- లు చొప్పున చెల్లించబడుతున్నది.
For any queries regarding above topic, please tell us through below comment session.