తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తయ్యింది.
హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కుడి కంటికి సంబంధించిన కాటరాక్ట్ ఆపరేషన్‌ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.
45 నిమిషాల్లోనే ఈ చికిత్స పూర్తి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
సర్జరీ అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు.
వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు.
ఆపరేషన్ తర్వాత వైద్యులతో కలిసి చంద్రబాబు దిగిన ఫొటో వైరల్ అవుతోంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు 50 రోజులకు పైగా రాజమండ్రి జైలులో ఉన్నారు.
ఆయన అనారోగ్యం దృష్ట్యా ఏపీ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
తిరిగి నవంబర్ 28వ తేదీన జైలు సూపరింటెండెంట్ వద్ద సరెండర్ కావాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
CHANDRABABU EYE OPERATION COMPLETED IN LV PRASAD HOSPITAL
Leave a Reply