సీఆర్‌ఐఎస్పీ స్టేట్ లీడ్ అధికారిణి ఉషాకుమారి : నేను అడిగిన ప్రశ్నలకు ఆంగ్లంలో చక్కగా సమాధానం చెప్పారు.
బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆంగ్ల భాష పరిజ్ఞానంపై ఒక పత్రిక అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని రిటైర్డ్ ఐఏఎస్, సీఆర్‌ఐఎస్పీ స్టేట్ లీడ్ అధికారిణి ఉషాకుమారి స్పష్టంచేశారు. బెండపూడి ‘బడాయే..” అమెరికన్ ఇంగ్లిష్ బాగోతం బట్టబయలు… అంటూ ఒక పత్రికలో గురువారం వచ్చిన కథనాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు ఉషాకుమారి శుక్రవారం ఒక ప్రక టన విడుదల చేశారు. “మీలో ఇంగ్లిష్ స్కిల్స్ పెంచడానికి ప్రత్యేక తరగతులు, అదనపు ఫ్యాకల్టీ ఏమైనా కావాలా’ అని మాత్రమే తాను ప్రశ్నించగా, అందుకు విద్యార్థులు చక్కగా సమాధానం చెప్పినట్లు ఉషాకుమారి వివరించారు.
ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను తాను మంద లించినట్లు కూడా ఆ పత్రికలో అవాస్తవాలు రాయడం బాధాకరమ న్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మారుమూల గ్రామీణ ప్రాంత పాఠశాల విద్యార్థులు సైతం ఇంగ్లిష్‌లో మాట్లాడే ప్రయత్నం జరుగుతున్నందుకు సీఆర్‌ఐఎస్పీ స్టేట్ లీడ్ అధికారిణిగా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, బోధనా సిబ్బందితో మాట్లాడుతూ ఇంగ్లిష్ బోధనలో వారికి ఇంకా ఏమైనా వన రులు లేదా సాంకేతిక సహకారం అవసరమైతే సీఆర్‌ఐఎస్పీ సహకరి స్తుందని చెప్పానని ఆమె వివరించారు. విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమాలకు సీఆర్‌ఐఎస్పీ సంస్థ ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తుందని ఉషాకుమారి తెలిపారు.
Leave a Reply