గ్యాస్ సిలిండర్ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. సిలిండర్ బుక్ చేయాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. అలాంటి వారికి శుభవార్త. సిలిండర్ వాడేవారికి అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
గ్యాస్ సిలిండర్ల ధరలు భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరలతో బతుకుజీవుడా అంటూ సామాన్యులు జీవనం సాగిస్తున్నారు. గృహావసరాలకు వినియోగించే 14 కిలోల సిలిండర్ ధర రూ.1,105గా ఉంది. ఈ నేపథ్యంలో మీకో గుడ్‌న్యూస్. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
భారీ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ల మీద ఏయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బజాజ్ ఫైనాన్స్ యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే సుమారుగా రూ.100 వరకు క్యాష్ బ్యాక్ దక్కుతుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుంది. ఈ నెల 28 వరకే ఈ డీల్ లభిస్తుందని గుర్తుంచుకోవాలి. అయితే తొలిసారి బజాజ్ ఫైనాన్స్ యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే వారు మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఈ ఆఫర్‌ను పొందేందుకు బజాజ్ పే యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది.
ఎయిర్‌టెల్ కస్టమర్లు కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్ మీద తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకుంటే రూ.20 తగ్గింపు లభిస్తుంది. ఇది కూడా పరిమిత కాల ఆఫర్ అని వినియోగదారులు గుర్తుంచుకోవాలి.
అలాగే అమెజాన్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే కూడా తగ్గింపును పొందొచ్చు. ఐసీఐసీఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకుంటే 2 శాతం క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది.
ఇంకా పలు స్క్రాచ్ కార్డులను కూడా సొంతం చేసుకోవచ్చు. వీటిల్లో వివిధ రకాల ఆఫర్లు ఉంటాయి. పేటీఎంలో రూ.5 నుంచి రూ.1,000 వరకు తగ్గింపును పొందొచ్చు. ఫ్రీ గ్యాస్ ప్రోమో కోడ్ ను వినియోగిస్తే 100 శాతం వరకు క్యాష్ బ్యాక్ వచ్చే చాన్స్ ఉంది.
గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌కు సంబంధించి పేటీఎంలో మరో ఆఫర్ కూడా ఉంది. మీరు గ్యాస్ 1,000 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే.. మీకు రూ.1,000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రూ.5 నుంచి రూ.1,000 లోపు ఎంతైనా రావొచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. సిలిండర్‌ను ఇలా బుక్ చేసుకుంటే నేరుగా తగ్గింపును పొందొచ్చు. అయితే దీనికి సూపర్ కాయిన్లు ఉండాలి. వీటి ద్వారా సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు వినియోగదారుడి దగ్గర 160 సూపర్ కాయిన్లు ఉన్నాయని అనుకుందాం.. అప్పుడు మీరు సిలిండర్ బుక్ చేయాలని భావిస్తే మీకు రూ.40 తగ్గింపు వస్తుంది.
ఇలా మీ దగ్గర ఉన్న సూపర్ కాయిన్ల సంఖ్యను బట్టి డిస్కౌంట్ దొరుకుతుంది. మరి. మీరూ గ్యాస్ సిలిండర్ వాడకందారులైతే ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు ఎలా అనిపించాయనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Leave a Reply