హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవరత్నాలు డాట్ కాం ఈ పోస్టు ద్వారా గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ కి ఆనందంగా 50 రూపాయి ఇవ్వాలో ఇవ్వ కూడదో తెలుసుకుందాం. సిలిండర్ డెలివరీబాయ్‌కు అదనంగా డబ్బు ఇవ్వొద్దు ఫ్రెండ్స్ ఎందుకో కింద చదవండి తెలుసుకోండి.
* తేల్చి చెప్పిన హె చ్‌వీసీఎల్ : గ్యాస్ సిలిండర్‌ను తీసుకున్న ప్రతిసారి రూ.80 లేదా రూ.50 అదనంగా చెల్లిస్తున్నారా..? ఇక ఇవ్వడం ఆపేయండి. డెలివరీబాయ్‌లకు అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని హెచ్‌పీసీఎల్ కంపెనీ చీఫ్ జనరల్ మేనేజర్ సీకే నరసింహ స్పష్టం చేశారు.
డిస్టిబ్యూటర్లు వినియోగదారుల ఇంటి వద్దకు గ్యాస్ సిలిండర్ చేర్చాల్సి ఉంటుందని, అందుకయ్యే ఛార్జీలు వారు చెల్లించే బిల్లులోనే కలిపి ఉంటాయని పేర్కొన్నారు. నగరానికి చెందిన రాబిన్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించగా ఈ మేరకు సమాధానమిచ్చారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply