Money | మీరు ఉచితంగా రూ. లక్ష పొందాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. మీకోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. ఒక లోగో డిజైన్ చేస్తే చాలు రూ. లక్ష పొందొచ్చు.
DESIGN A LOGO FOR YUVA TOURISM CLUB GET RS 1 LAKH CASH PRIZE
Bank Account | కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్ ఒకటి తీసుకువచ్చింది. ఉచితంగానే రూ. లక్ష పొందే అవకాశం ఉంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలసుకోవాల్సిందే. మోదీ సర్కార్ ఒక కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతగా నిలిస్తే వారికి రూ.లక్ష లభిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం యూత్ టూరిజం లక్ష్యంగా ఇండియా@75 కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం యువ టూరిజం క్లబ్స్ నిర్వహిస్తోంది. యువత పర్యాటక రంగానికి యువ రాయబారులుగా ఉంటారని, యువత పంచుకున్న అనుభవాలు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులను ప్రయాణం చేయడానికి మరింత ప్రోత్సహిస్తాయని తెలిపింది.
బాధ్యతాయుతమైన పర్యాటక పద్ధతులను ప్రచారం చేయడం, చదువుతో పాటుగా ట్రావెల్ అండ్ టూరిజం ప్రాముఖ్యత తెలియజేయడం వల్ల విద్యార్ధులను హాస్పిటాలిటీ అండ్ టూరిజం రంగంలో స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌గా మార్చొచ్చని కేంద్రం భావిస్తోంది.
అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక మంత్రిత్వ శాఖ మైగౌవ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యువ టూరిజం క్లబ్ కోసం లోగో డిజైన్ పోటీని యువకుల కోసం నిర్వహిస్తోంది.
ఆసక్తి కలిగిన వారు ఈ పోటీలో పాల్గొనవచ్చు. విజేతగా నిలిచిన వారికి రూ. లక్ష లభిస్తాయి. మీరు అప్లికేషన్ సమర్పించడానికి 2023 మార్చి 1 వరకు గడువు ఉంటుంది. అందువల్ల మీరు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలని భావిస్తే.. వెంటనే అప్లికేషన్ పంపించండి.
మీరు ఆన్‌లైన్‌లోనే ఈ పని సులభంగానే చేయొచ్చు. మైగౌవ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు అప్లికేషన్ సబ్‌మిట్ చేయొచ్చు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి.
విజేతగా నిలిచిన వారు డిజైన్ చేసిన లోగోను టూరిజం శాఖ వినియోగించుకుంటుంది. పోటీలో పాల్గొనే వారు వారి పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పోస్టల్ అడ్రస్ వంటి వివరాలు అన్నింటినీ అందించాల్సి ఉంటుంది.
ఒక్కసారి మీరు మీ అప్లికేషన్ సబ్‌మిట్ చేసిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకోవడం వంటివి అంటూ ఏమీ ఉండదు. ఒక వ్యక్తి కేవలం ఒక్కసారి మాత్రమే అప్లికేషన్ సబ్‌మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ఎంట్రీలకు ఛాన్స్ లేదు.
లోగో డిజైన్ అనేది తప్పనిసరిగా జేపీజీ, జేపీఈజీ, పీఎన్‌జీ, ఎస్‌వీజీ ఫార్మాట్లలోనే ఉండాలి. అలాగే లోగోను డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీదనే రూపొందించాలి. కలర్‌లో లోగో డిజైన్ ఉండాలి. లోగో సైజ్ 5 * 5 సెంటీమీటర్ల నుంచి 60 * 60 సెంటీమీటర్ల వరకు ఉండొచ్చు.
ల్యాండ్‌స్కేప్ లేదా పోట్రేట్ ఇలా మీరు ఎలాగైన లోగోను డిజైన్ చేయొచ్చు. లోగోను వెబ్‌సైట్‌లో ఉపయోగించేలా ఉండాలి. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో కూడా వాడేలా మీరు లోగోను రూపొందించాలి. లోగో కనీసం 300 డీపీఐ రెజల్యూషన్‌తో ఉండాలి.
Leave a Reply