తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి కీలక సమాచారం అందింది. తెలుగు రాష్ట్రాల్లోని రూ.52,125.32 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులను కేంద్రం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద గుర్తించింది. అందులో ఏపీకి సంబంధించిన కీలక ప్రాజెక్టులతో పాటుగా హైదరాబాద్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణం పరంగా కీలక ముందడుగు పడింది. పీఎం గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌లో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అందులో భాగంగా..దేశవ్యాప్తంగా దాదాపు రూ.4.53 లక్షల కోట్ల విలువైన 63 ప్రాజెక్టులను గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌లో చేర్చడానికి నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూపు గుర్తించింది. ఏపీ – తెలంగాణలను కలిపే కీలక రైలు మార్గం లో కీలక పనులను కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఏపీ ప్రజలకు ఉపయోగకరం కానుంది.
ఏపీ వాసులకు గుడ్ న్యూస్..
ఇప్పుడు ఏపీలో మౌళిక వసతులు – రవాణా సౌకర్యాల పెంపు పైన రాష్ట్ర..కేంద్ర ప్రభుత్వాలు ఫోకస్ చేసాయి. తాజాగా కేంద్రం ప్రతిపాదించిన బడ్జెట్ లో ఏపీలో జాతీయ రహదారుల కోసం 4,955 కోట్లు మంజారు చేసారు. ఇప్పుడు ఎంతో కాలంగా పెండింగ్ డిమాండ్ గా ఉన్న గుంటూరు-బీబీనగర్ రైల్వే లైను డబులింగ్ పనులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. దానితోపాటు విశాఖపట్నం పోర్ట్ లాజిస్టిక్స్ పార్కు పనులకు కేంద్రం నిధులు కేటాయించింది. గుంటూరు నుంచి బీబీనగర్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే లైన డబులింగ్ డిమాండ్ దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంది. దీనికి సంబంధించి కేంద్రానికి పలు ప్రతిపాదనలు అందాయి. ఈ లైన్ డబ్లింగ్ పూర్తయితే, తెలుగు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణం వేగం పెరగటంతో పాటుగా రైళ్ల సంఖ్య పెరగనుంది. ఈ లైన్లో సరుకు రవాణా ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో విశాఖకు ఇస్తున్న ప్రాధన్యతకు కొనసాగింపు లో భాగంగా.. కేంద్రం తాజాగా విశాఖపట్నం పోర్ట్ లాజిస్టిక్స్ పార్కుకు రూ 255 కోట్లు కేటాయించింది.
పీఎం “మాస్టర్ ప్లాన్ ” లో హైదరాబాద్..
ప్రధాన మంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్ లో ఇప్పుడు హైదరాబాద్ చేరింది. నగరానికి కీలకమైన ఔటర్ రీజనల్ రింగ్ రోడ్డు కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రేటర్‌కు ఉత్తర భాగంలో 158 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికిగానూ భూసేకరణకు సర్వే పూర్తవగా తాజాగా గ్రేటర్‌కు దక్షిణంవైపు రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గ్రేటర్ చుట్టూ 340 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో భాగంగా దక్షిణ భాగం రోడ్డు నిర్మాణ పనులను వేగంగా చేపట్టడానికి ‘పీఎం గతిశక్తి’ మాస్టర్ ప్లాన్‌లో చేర్చింది. గతిశక్తి మాస్టర్‌ప్లాన్ కింద ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం నిర్మాణం కోసం రూ.2659 కోట్లు కేటాయించింది. దేశవ్యాప్తంగా దాదాపు రూ. 4.53 లక్షల కోట్ల విలువైన 63 ప్రాజెక్టులను గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌లో చేర్చడానికి నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూపు (పీఎన్‌జీ) గుర్తించింది. రహదారుల శాఖకు చెందిన రూ.299476.4 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులు ఉండగా… రూ.79015.7 కోట్ల విలువైన ఎనిమిది పట్టణాభివృద్ధి శాఖ ప్రాజెక్టులు, రూ.47041.2 కోట్ల విలువైన 21 రైల్వే ప్రాజెక్టులు, రూ.12780.6 కోట్ల విలువైన ఐదు వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రాజెక్టులు, రూ.9056 కోట్ల విలువైన నాలుగు పెట్రోలియం, సహజవాయువుల ప్రాజెక్టులు ప్రాజెక్టులు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో రూ.52,125.32 కోట్ల విలువైన
పీఎం గతిశక్తి ప్లాన్ లో తెలుగు రాష్ట్రాల్లోని రూ.52,125.32 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులు, అంచనా వ్యయం ఖరారవ్వని మరొక ప్రాజెక్టు ఉంది. కేంద్రం గుర్తించిన వాటిలో రైల్వే, రహదారులు, మోట్రో, పెట్రోలియం పైప్‌లైన్, పారిశ్రామిక కారిడార్ల ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే హైదరాబాద్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రహదారికి రూ. 15 వేల కోట్లు కేటాయించింది. హైదరాబాద్-నాగ్‌పూర్ రహదారి కోసం రూ. 12,647 కోట్లు ప్రతిపాదించారు. నాగ్‌పూర్-విజయవాడ ఆర్థిక కారిడార్‌లో భాగంగా వరంగల్-ఖమ్మం సెక్షన్‌లో నాలుగులైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ రహదారిపై ఊరుగొండ గ్రామం నుంచి వీ వెంకటపాలెం వరకు 108.24 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం కోసం రూ. 14,055 కోట్లు ప్రాజెక్టులను పీఎన్‌జీ షార్ట్‌లిస్ట్ చేసింది. కాగా, మౌలిక సదుపాయాల కల్పనకు 2023-24 బడ్జెట్‌లో ప్రకటించిన రూ.10 లక్షల కోట్లను ఈ ప్రాజెక్టులకు కూడా వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం – తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టులు ముందుకు వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు కేంద్రం నిర్ణయం పైన రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.
Leave a Reply