The government has given good news to the ration card holders in AP : నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకి ప్రభుత్వం అందించే రేషన్ తో మూడు పూటలా తిండి తినగలుగుతున్నారడంలో అతిశయోక్తి లేదు. పేద వర్గాలకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యం అనే చెప్పాలి. రేషన్ కార్డు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య శ్రీ, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడం కోసం రేషన్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. కరోనా కష్టకాలంలో రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు అభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తున్నారని.. రైతుల నుంచి ప్రతి దాన్యపు గింజ కొనుగోలు చేస్తామని ఎలాంటి అందోళన అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో రైతుల నుంచి దాన్యం సేకరణ నుంచి ప్రజలకు రేషన్ పంపిణీ వరకు అన్నింటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. విజయవాడలోని పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో కమాన్ కంట్రోల్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తుందని ఇప్పుడు గోధుమ పిండి కూడా చేర్చుతుందని అన్నారు.
రేషన్ కార్డుదారులు అడిగితే నెలకు ఒక్కో కుటుంబానికి 2 కిలోల చొప్పున కందిపప్పు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి కిలో కందిపప్పు ఇస్తున్నామని.. కానీ వారు తీసుకోవడం లేదని అన్నారు. త్వరలో చిరుధాన్యాల పంపిణీ కూడా మొదలు పెడతామని.. అలాగే గోధుమ పిండి పంపిణీ రాష్ట్రమంతటా విస్తరిస్తామని అన్నారు మంత్రి కారుమూరి. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి దాన్యం లోడింగ్ నుంచి గోదాములకు పంపడం సహా సీసీ కెమెరాల్లో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని ఆయన అన్నారు. అంతేకాదు ఎండియూ వాహనాలు సరిగా పనిచేస్తున్నాయా అన్న విషయాలపై దృష్టి సారిస్తున్నామని అన్నారు. ఏపిలో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు భేష్ అని ప్రశంసలు వస్తున్నాయని మంత్రి అన్నారు.
Leave a Reply