GST Meeting | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపికబురు అందించారు. పలు ప్రొడక్టులపై జీఎస్‌టీ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల పలు ప్రొడక్టుల ధరలు దిగి రానున్నాయి.
49th GST Council Meeting GST on Liquid Jaggery Pencil Sharpeners Certain Tracking Devices Slashed
Nirmala Sitharaman | కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త తీసుకువచ్చారు. పలు వస్తువులపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల కొన్ని ప్రొడక్టుల ధరలు దిగి రానున్నాయి. నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 49వ జీఎస్‌టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జీఎస్‌టీ తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి.
పెన్సిల్ షార్ప్‌నర్స్, పలు ట్రాకింగ్ డివైజ్‌లపై జీఎస్‌టీ తగ్గించారు. వీటిపై జీఎస్‌టీ 18 నుంచి 12 శాతానికి దిగి వచ్చింది. ద్రవ బెల్లం వంటి వాటిపై జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అదే లూజ్ అయితే ఎలాంటి జీఎస్‌టీ ఉండదు. ప్రిప్యాక్డ్, లేబుల్డ్ అయితే 5 శాతం జీఎస్‌టీ పడుతుంది. అంతేకాకుండా ఆలస్యం దాఖలు చేసిన వార్షిక జీఎస్‌టీ రిటర్న్స్‌పై పెనాల్టీను హేతుబద్దీకరించాలని జీఎస్‌టీ కౌన్సిల్ ప్రతిపాదించింది. అలాగే రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం కింద పెండింగ్‌లో ఉన్న బకాయిలను రూ. 16,982 కోట్లు ఈ రోజే చెల్లిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
అలాగే పాన్ మసాలా, గుట్కా వంటి వాటిపై జీఎస్‌టీ అనేది తయారీ దశలోనే పడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇంకా మిల్లెట్స్‌పై ట్యాక్స్‌కు సంబంధించిన అంశాలను వచ్చే జీఎస్‌టీ కౌన్సిల్‌లో పరిశీలిస్తామని ఆమె తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో కూడా మిషన్ మిల్లెట్స్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వార్షిక టర్నోవర్ రూ. 20 కోట్ల వరకు కలిగిన స్మాల్ ట్యాక్స్ పేయర్లకు జీఎస్‌టీఆర్ 9 లేదా వార్షిక రిటర్న్ దాఖలులో ఆస్యం అయితే అప్పుడు ఆలస్య రుసుమును హేతుబద్దీకరిస్తామని వివరించారు.
Leave a Reply