Harish Rao: బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధి.. విదేశీ విద్యకు సాయం
Telangana Budget 2023: తెలంగాణ బడ్జెట్‌లో ఎస్సీ , ఎస్టీలకు భారీగా నిధులు కేటాయించారు. ఎస్సీ ప్రత్యేక నిధి రూ. 36,750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ. 15,233 కోట్లు కేటాయించారు.
ప్రధానాంశాలు:
ఎస్సీ, ఎస్టీలకు గుడ్ న్యూ్స
బడ్జెట్‌లో ప్రత్యేక నిధి ఏర్పాటు
భారీగా కేటాయింపు
Telangana Budget 2023: తమ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి పాటుపడుతుందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావున్న అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆయన.. ఎస్సీ, ఎస్టీలకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రత్యేక నిధి ద్వారా భారీగా కేటాయింపులు చేశారు. ఎస్సీ ప్రత్యేక నిధి రూ. 36,750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ. 15,233 కోట్లు కేటాయించారు. గిరిజనులకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వారికి పాలన చేరువ చేశామన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా ఎస్సీ బిడ్డలకు రూ. 20 లక్షల వరకు విదేశీ విద్యకు సాయం చేస్తున్నామన్నారు.
ఇక దళితబంధు పథకానికి బడ్జెట్‌లో రూ. 17,700 కోట్లు కేటాయించారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి దళిత కటుంటానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని హరీశ్ రావు అన్నారు. దళితులు వ్యాపార రంగంలో ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సుల ద్వారా చేసుకునే లాభదాయక వ్యాపారాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు చెప్పారు. దళితుల గృహ అవసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పిస్తున్నట్లు చెప్పారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ మెుత్తం 2,90,396 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. మూలధన వ్యయం 2,11,685 కోట్లు కాగా.. పెట్టుబడి వ్యయం 37,525 కోట్లు. కరోనా, ఆర్థిక మాధ్యం వంటి సంక్షోభాలను తట్టుకొని రాష్ట్రం నిలబడిందని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply