హైకోర్టులో చంద్రబాబుకు మరో రిలీఫ్ దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటీషన్ పైన న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గతంలో ఇచ్చిన నిబంధనలను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదే సమయంలో కొన్ని కీలక సూచనలు చేసింది. సీఐడీ కోరిన నిబంధనల విషయంలో పిటీష్ ను కోర్టు డిస్పోజ్ చేసింది. దీంతో, ఇప్పుడు కోర్టు నిర్దేశించిన షరతులకు అనుగుణంగా చంద్రబాబు వ్యవహరించాల్సి ఉంటుంది.
పిటీషన్ డిస్పోజ్:చంద్రబాబుకు స్కిల్ స్కాంలో హైకోర్టు షరులతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు బెయిల్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అనారోగ్య కారణాలతో చికిత్స కోసం ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో, కోర్టు నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు మీడియాతో మాట్లాడటం..ర్యాలీ నిర్వహించటం కోర్టు కండీషన్లను ఉల్లంఘించటమే అనే చర్చ మొదలైంది. చంద్రబాబు పైన మరిన్ని నిబందనలను అమలు చేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీని పైన న్యాయస్థానం విచారించింది. స్కిల్ కేసులో మడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
High Court Dispoes Cid Request on Chandra Babu Bail Conditions Says Same Will Continue
కండీషన్లు అమలు:రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని ఇచ్చిన ఆదేశాలు సైతం అమల్లో ఉంటాయని తేల్చి చెప్పింది. చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలనే సీఐడీ అభ్యర్దనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో నిర్దేశించిన న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ పైన ఈ నెల 10వ తేదీన విచారణ చేయనుంది. అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన ఈ నెల 8న తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది. సుప్రీం తీర్పుకు అనుగుణంగా ఇతర కేసుల్లో చంద్రబాబు పైన విచారణ సంస్థ తదుపరి చర్యలకు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఇక, మధ్యంతర బెయిల్ తరువాత హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఆస్పత్రిలో చంద్రబాబు:చంద్రబాబు ఈ మధ్యాహ్నం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్తారని సమాచారం. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన తరువాత కంటి ఆపరేషన్ పైన నిర్ణయం తీసుకోనున్నారు. వైద్యుల సలహా మేరకు చంద్రబాబు విశ్రాంతి తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ లో చంద్రబాబు చేరుకున్న సమయంలో నిర్వహించిన ర్యాలీ పైన కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఉల్లంఘిస్తూ ర్యాలీ నిర్వహించటం పైన ఈ కేసు నమోదు చేసారు. ఇక, చంద్రబాబు కేసుల్లో అటు సుప్రీంకోర్టు క్వాష్ పిటీషన్ పైన తీర్పు తదనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.
Leave a Reply