అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. జీతాల కోసం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన నేతలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో.. వారు హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. షోకాజ్ నోటీసులపై స్టే విధించింది.
ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కాగా ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు, బకాయిలు అందేలా చట్టం చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు ఇటీవల గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
Leave a Reply