Housing Department: సొంత ఇల్లు అనేది పేదవాడి కల అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఇళ్ల నిర్మాణంలో లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. ల్యాబులను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి. పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలని అధికారులను ఆదేశించారు. పూర్తయిన ఇళ్లకు 15 రోజుల్లోగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.
CHIEF MINISTER YS JAGAN MOHAN REDDY REVIEW ON HOUSING DEPARTMENT
ప్రధానాంశాలు:
- హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష
- సొంతిల్లనేది పేదవాడి కలన్న సీఎం జగన్
- నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని ఆదేశాలు
Housing Department: సొంత ఇల్లు పేదవాడి కల. వారికి ఇచ్చే ఇళ్ల నిర్మాణంలో లోపం ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. లే అవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత. వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఇళ్ల నిర్మాణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకూ చేసిన ఖర్చు రూ.7630 కోట్లు అని సీఎం జగన్ వివరించారు. ఈ ప్రభుత్వం ఇప్పటివరకూ మొత్తంగా రూ.13,780 కోట్లు కేవలం ఇళ్ల నిర్మాణం కోసమే ఖర్చు చేసిందన్నారు. సుమారుగా 2.75 లక్షల ఇళ్లను పూర్తిచేశామని. మరో 74 వేల ఇళ్లలో శ్లాబు వేసే పనులు జరుగుతున్నాయని. అధికారులు సీఎంకు వివరించారు. మరో 79 వేల ఇళ్లు రూఫ్ లెవల్లో ఉన్నాయన్నారు. మార్చి నాటికి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద చేపట్టిన ఇళ్లలో. సుమారు 5 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా పనులు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు.
‘టిడ్కో ఇళ్ల కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.8015 కోట్లు అయితే. ఈ ప్రభుత్వం చేసిన ఖర్చు, పేదలకు కల్పించిన ప్రయోజనాలు విలువ చూస్తే మొత్తంగా రూ.20,745 కోట్లు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ఖర్చుకింద, మౌలిక సదుపాయాల కోసం. ఈ మూడున్నర సంవత్సరాల్లోనే రూ.8,734 కోట్లు ఖర్చు చేశాం. దీంతోపాటు 300 అడుగుల ఇళ్లను ఉచితంగా ఇవ్వడం వల్ల దాదాపు రూ.10,339 కోట్ల రూపాయల లబ్ధి పేదలకు జరిగింది’ అని జగన్ వివరించారు.
‘లబ్ధిదారులు తమ వంతుగా చెల్లించాల్సిన డబ్బును పూర్తిగా మాఫీ చేయడమే కాకుండా. బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం లేకుండా. నెలా నెలా వాయిదాలు కట్టాల్సిన పనిలేకుండా పూర్తి ఉచితంగా ఆ ఇళ్లను అందిస్తున్నాం. మిగిలిన వారికీ ఊరట కల్పించే చర్యల్లో భాగంగా 365, 430 చదరపు అడుగులు ఇళ్లకు లబ్ధిదారులకు తమ వంతుగా చెల్లించాల్సిన డబ్బులో కల్పించిన సబ్సిడీ కారణంగా రూ. 482 కోట్ల మేర లబ్ధిజరిగింది. ప్రభుత్వం ఆ భారాన్ని కూడా తీసుకుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను తొలగించి ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా. మరో రూ.1200 కోట్ల భారాన్ని ప్రభుత్వం తీసుకుంది’ అని జగన్ స్పష్టం చేశారు.
ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపం లేకుండా చూడాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో. తాము తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. స్టేజ్ కన్వెర్షన్ బాగా జరిగిందని అధికారులు జగన్‌కు వివరించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతను పరీక్షించేందుకు మొత్తంగా 36 ల్యాబులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించే మెటల్ నాణ్యతపై 285 పరీక్షలు, సిమెంటుపైన 34 పరీక్షలు, స్టీలుపై 84 పరీక్షలు, ఇటుకలపైన 95 టెస్టులు. ఇలా పలురకాల పరీక్షలు నిర్వహించామని ముఖ్యమంత్రికి చెప్పారు. ఎక్కడ లోపం వచ్చినా. వెంటనే గుర్తించి. నాణ్యతను పెంచుకునేందుకు ల్యాబులు ఉపయోగపడుతున్నాయని వివరించారు.
Leave a Reply