ఏపీలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. ఇన్పుట్ సబ్సిడీ అయితే రిలీజ్ చేయబోతోంది.
ఎవరైతే రైతులు తమ పంటను నష్టపోయి ఇబ్బంది పడుతున్నారో, ఆ రైతులు అందరికీ కూడా ఆర్థిక సహాయం కింద ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వబోతున్నారు. అకాల వర్షాల వల్ల గాని వరదలు వల్ల గాని ఎవరైతే రైతులు తమ పంటను నష్టపోయారో, వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయం చేసి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది.
గతంలో ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి చాలా ఆలస్యం అయ్యేది. అలా కాకుండా ఈసారి ఏ సీజన్ కి ఆ సీజన్ లోనే ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు.
ఈ ఇన్పుట్ సబ్సిడీ ని ఈనెల 24వ తేదీన ఇవ్వబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఎవరైతే రైతులు పంట నష్టపోయి ఇ-క్రాప్అప్లై చేశారో వారందరి అకౌంట్లోకి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ఫిబ్రవరి 24వ తేదీన జమ అవుతుంది.
Leave a Reply