Savings Account | బ్యాంక్ అకౌంట్‌పై అధిక వడ్డీ రేటు పొందాలని భావిస్తున్నారా? అది కూడా ప్రతి నెలా వడ్డీ డబ్బులు బ్యాంక్ ఖాతాలోకి పొందాలని చూస్తున్నారా? అయితే ఈ బ్యాంక్ మీకు అనువైంది.
IDFC FIRST BANK EARN UP TO 6 75 PERCENT INTEREST ON SAVINGS ACCOUNT
Bank News | బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీకు పలు రకాల సర్వీసులు ఉచితంగా లభిస్తూ ఉంటాయి. అలాగే మరి కొన్నింటికి మాత్రం చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలా బ్యాంకులు అకౌంట్ ఉన్న వారికి ఎన్నో రకాల సర్వీసులు అందుబాటులో ఉంచాయి.
బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి లభిస్తున్న అనేక సర్వీసుల్లో వడ్డీ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. అంటే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఉంటే.. వాటిపై వడ్డీ వస్తుంది. ఎంత మొత్తంపై ఎంత వడ్డీ వస్తుందనే అంశం పలు అంశాల ప్రతిపదికన మారుతుంది.
చాలా వరకు బ్యాంకులు బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బుల ఆధారంగా వడ్డీని అందిస్తూ ఉంటాయి. అంటే రూ. లక్ష వరకు బ్యాలెన్స్ ఉంటే ఒక వడ్డీ రేటు, ఆపైన బ్యాలెన్స్ ఉంటే మరో వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇలా బ్యాంక్ అకౌంట్‌లోని బ్యాలెన్స్ ప్రాతిపదికన మీకు వచ్చే వడ్డీ మారుతుంది.
అంతేకాకుండా బ్యాంక్ ప్రాతిపదికన కూడా వడ్డీ రేటులో మార్పు ఉంటుంది. ఒక బ్యాంక్ ఎక్కువ వడ్డీ అందిస్తే.. మరో బ్యాంక్ తక్కువ వడ్డీ అందిస్తూ ఉంటాయి. అందువల్ల వడ్డీ రేటు అనేది బ్యాంక్ ప్రాతిపదికన మారుతూ ఉంటుందని గమనించాలి.
ఇప్పుడు మనం అధిక వడ్డీ రేటు అందించే బ్యాంకుల్లో ఒకటైన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. ఈ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై గరిష్టంగా 6.75 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది.
ఎస్‌బీఐ సహా ప్రముఖ బ్యాంకుల్లోని సేవింగ్స్ ఖాతాలపై ఉన్న వడ్డీ రేట్లతో పోలిస్తే.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లోనే అధిక వడ్డీ రేటు వస్తోందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ బ్యాంక్‌లో అకౌంట్ లేని వారు ఆన్‌లైన్‌లోనే ఖాతా తెరవొచ్చు.
అధిక వడ్డీ రేటు మాత్రమే కాకుండా ఈ బ్యాంక్‌లో ఖాతా ఓపెన్ చేయడం వల్ల పలు రకాల ప్రయోజనాలు కూడా పొందొచ్చు. సేవింగ్స్ ఖాతాలపై వచ్చే వడ్డీ మొత్తం ప్రతి నెలా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. చాలా వరకు బ్యాంకులు మూడు నెలలకు ఒకసారి వడ్డీ డబ్బులు చెల్లిస్తాయి.
అంతేకాకుండా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కస్టమర్లు డెబిట్ కార్డుపై రూ. 6 లక్షల వరకు పర్చేజ్ లిమిట్ పొందొచ్చు. ఇంకా ఏటీఎం నుంచి డెబిట్ కార్డు ద్వారా ఒకే రోజు రూ. 2 లక్షల వరకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇంకా మరో బెనిఫిట్ కూడా ఉంది. ఈ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా కలిగిన వారు ఎలాంటి చార్జీలు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్ని సార్లు అయినా డబ్బులు విత్‌డ్రా చేయొచ్చ.
Leave a Reply