హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవరత్నాలు డాట్ కాం వెబ్ పేజీ ద్వారా జగనన్న చేదోడు పథకానికి అప్లై చేయడానికి కావలసిన సర్టిఫికెట్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ వెబ్ పేజి ని పూర్తిగా చదివి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి మేము వెంటనే స్పందిస్తాము.
జగనన్న చేదోడు అంటే షాపులు ఉన్న రజకులు, షాపులు ఉన్న నాయి బ్రాహ్మణులు, షాపులు ఉన్న టైలర్ లు ఇలా ఏదైనా షాపు ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జగనన్న చేదోడు పథకం కింద అందిస్తోంది. ఈ సంవత్సరం అనగా 2023 కి సంబంధించిన లబ్ధి త్వరలో రాబోతోంది కాబట్టి, కొత్తగా అప్లై చేసుకునే వారికి మరియు ఇదివరకే లబ్ధి పొందుతున్న వారికి కొత్తగా క్యాస్ట్ (Caste) మరియు ఇన్కమ్ (Income) సర్టిఫికెట్ అప్లై చేసుకోవాలని గవర్నమెంట్ (ప్రభుత్వం) తెలిపింది. ఎందుకంటే ఏపీ మీసేవ పోర్టల్ (AP SEVA PORTAL) అనేది కొత్త గా అప్డేట్ చేశారు కాబట్టి అందులో ఉన్న సర్టిఫికెట్లు (Certificates) మాత్రమే వ్యాలీడ్ (Valid) కాబట్టి పాత వాళ్ళు అందరూ కూడా క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ కి మళ్లీ అప్లై చేసుకోవాలి.
మీసేవ పోర్టల్ (1.0 Version) Updated to ఏపీ మీసేవ పోర్టల్ (2.0Version)
Now AP SEVA PORTAL Certificates only Valide
అంతేకాదు ఈ క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ తో పాటు లేబర్ సర్టిఫికెట్ కూడా మళ్లీ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఏపీ మీసేవ పోర్టల్ అనేది అప్డేట్ అయింది కాబట్టి అందులో AP SEVA PORTAL లో డౌన్లోడ్ చేసిన లేబర్ సర్టిఫికెట్ మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది కాబట్టి ఖచ్చితంగా పాత వాళ్ళు గాని లేదా కొత్తగా Jagananna Chedodu 2023 Scheme కి అప్లై చేయదలచిన వాళ్ళు గాని మీరు మళ్లీ labour Certificate (కార్మిక ధృవీకరణ పత్రం) అప్లై చేయండి.
ఇలాంటి పాత లేబర్ సర్టిఫికెట్ చెల్లదు – కొత్తగా ఏపీ సేవ పోర్టల్ అప్లై చేసుకోండి
Note : ఎందుకంటే AP SEVA PORTAL లో డౌన్లోడ్ చేసిన సర్టిఫికెట్లు మాత్రమే ఇప్పుడు చెల్లుతుంది.
జగనన్న చేదోడు దరఖాస్తు ఫారం
షాపులు ఉన్న రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్ లకు RS.10,000/- ఆర్థిక సహాయం
కొత్త లేబర్ సర్టిఫికెట్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి
ఇప్పుడు కొత్తగా లేబర్ సర్టిఫికెట్ ని మీ సచివాలయంలోనే అప్లై చేసుకోవచ్చు, అది ఎలాగో పూర్తిగా చదవండి. ఈ సర్టిఫికేట్ ని కేవలం 40 రూపాయల కి ఇస్తారు. ఈ సర్టిఫికెట్ కి అప్లై చేసుకోవాలి అంటే మీరు ముందుగా దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది మీ గ్రామ వార్డు సచివాలయం లో నే ఇస్తారు, లేదా మీ వాలంటరీ ని అడిగిన కూడా వాళ్ళే ఇస్తారు మరియు వాళ్లే అప్లికేషన్ ని ఫీల్ చేస్తారు. ఇలా ఫిల్ చేసిన అప్లికేషన్ తో పాటు మీ పాస్ పోర్ట్ సైజు ఫోటో ఒకటి విత్ సిగ్నేచర్, మరియు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ఏదో ఒకటి జతచేయాలి. అలాగే మీ షాప్ ఎక్కడైతే ఉందో దాని అడ్రస్ ప్రూఫ్ కావాలి ఉదాహరణకి కరెంట్ బిల్ మరియు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ జతచేయాలి.
కావలసిన డాక్యుమెంట్స్
అప్లికేషన్
ఆధార్ కార్డు / పాన్ కార్డు
షాపు అడ్రస్ ప్రూఫ్ (ఉదాహరణకి కరెంట్ బిల్)
సెల్ఫ్ డిక్లరేషన్ (సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ లో ఉన్న చివరి పేజీ స్వయ దృవీకరణ పత్రం, దానిని ఫిల్ చేసి సంతకం చేస్తే సరిపోతుంది.)
స్వీయ ధ్రువీకరణ పత్రం
ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మీ సచివాలయంలో ఇవ్వవలసి ఉంటుంది అయితే మినిమం గా ఫీజు 40 రూపాయలు ఉంటుంది. కానీ మీ షాప్ లో ఉన్న ఎంప్లాయిస్ పెరిగే దాన్నిబట్టి ఫీజు కూడా పెరిగే అవకాశం ఉంది.
Application Fee : Rs.40/- (Minimum) Maybe higher based on number of employees (workers)
Q) లేబర్ సర్టిఫికేట్ రూపొందించడానికి ఎంత సమయం పడుతుంది?
A) మీరు ఈ సర్టిఫికెట్ కి అప్లై చేసుకున్న వెంటనే అప్పటికప్పుడే ఈ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది అక్కడే ఉండి మీరు 5 నిమిషాల్లో ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
Q) How much time it takes to generate Labour Certificate ?
A) As soon as you apply for this certificate, this certificate will be generated immediately and you can take a print out of it within 5 minutes.
గమనిక : కాబట్టి జగనన్న చేదోడు పథకానికి AP SEVA PORTAL ద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ మరియు లేబర్ సర్టిఫికెట్ ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇవన్నీ నీ కరెక్ట్ గా ఉన్న వాళ్లకి ఎటువంటి అభ్యంతరం లేకుండా లబ్ధి చేకూరే అవకాశం ఉంది
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply