హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవరత్నాలు డాట్ కాం వెబ్సైట్ ఈ వెబ్ పేజీ ద్వారా జగన్ అన్న వసతి దీవెన 2023 ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న వసతి దీవెన పథకం గురించి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై చదువులు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, యూనివర్శిటీలు, బోర్డుల్లో చదువుతున్న జగనన్న వసతి దీవెన పథకానికి అర్హులైన విద్యార్థులకు ఒక శుభవార్త. అదేమిటంటే జగనన్న వసతి దీవెన డబ్బులు జనవరి 26 వ తేదీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
గమనిక : జగనన్న వసతి దీవెన ఆర్థిక సహాయం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కావున ఈనెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగనన్న వసతి దీవెన కు అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థి అకౌంట్లో పదివేల రూపాయలు జమ చేయబడతాయి.
పథకం పేరు : జగనన్న వసతి దీవెన
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
ఆవిష్కరణ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
లబ్ధిదారులు : విద్యార్థులు
ప్రయోజనం : రూ.20 వేల వరకు ఆర్థిక సాయం (ప్రతి సంవత్సరం)
జగనన్న అన్న వసతి దీవెన అంటే ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోన్‌రెడ్డి పేద విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన పథకాన్ని అందిస్తున్నారు. దీని పేరు జగనన్న వసతి దీవెన. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ అభ్యసించే వారికి రూ.20 వేల వరకు వసతి, భోజన, రవాణా ఖర్చుల కోసం వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుంది.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply