ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
జగనన్న వసతిదీవెన అంటే ఏమిటి ?
పేద విద్యార్దులు ఉన్నత విద్యను కొనసాగించుటకై ఆర్టిక భరోసా ఇచ్చి ప్రోత్సహించడమే పధకం లక్ష్యం.
అర్హతలు :
కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000/- లోపు ఉన్నవారు అర్హులు.
కుటుంబానికి వ్యవసాయ భూమి మాగాణి అయితే 10 ఎకరాలు కన్న తక్కువ లేదా మెట్ట భూమి అయితే 25 ఎకరాలకన్న తక్కువ లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 25 ఎకరాలు లోపు ఉన్నవారు అర్హులు.
కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి / ఆదాయ పన్ను చెల్లింపుదారు / పెన్నన్ దారుడు ఉన్న యెడల అర్హులు కారు ( పారిశుధ్య కార్మికులు మినహా).
పట్టణ ప్రాంతములో 1,500 చ.అ.లు కన్నా తక్కువ బిల్లప్ ఏరియా (నివాస మరియు వాణిజ్య భవనం) కలిగిన కుటుంబం అర్హులు.
ఐ.టి.ఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఆపై కోర్సులను ప్రభుత్వము గుర్తింపు వున్న కళాశాలల్లో చదువుతున్న వారు అర్హులు.
జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకొనే విధానము:
2023-24 సంవత్సరంలో అనర్హత జాబితాలో వున్నవారు అభ్యంతరములు వున్నట్లెతే, వారి అర్హత బుజువులతో గ్రామ / వార్డు సచివాలయం ద్వారా “నవశకం” లాగిన్ లో అభ్యంతరములు దాళఖులు చేసిన యెడల వాటిని పరిశీలించి తగు చర్య గైకొనబడును.
2023-24 విద్యా సంవత్సరంలో కళాశాలలు తెరచిన పిమ్మట అర్హతగల విద్యార్దులు తమ దరఖాస్తులను వారి కళాశాల ద్వారా “జ్ఞానభూమి ” పోర్టల్ నందు నమోదు చేసుకొనవచ్చును. లేదా దరఖాస్తులను గ్రామ / వార్డు వాలంటీర్ల ద్వారా కాని, లేదా స్వయంగా గ్రామ / వార్డు సచివాలయం నందు గాని దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request- మీ సేవల అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది.
సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply