రైతు లేనిదే ఏ దేశం కూడా వృద్ధిలోకి రాలేదు. రైతు బాగుంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే భారతదేశంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. కేటాయింపులు, నిధుల విషయంలో రైతులకు ప్రాధాన్యత కల్పిస్తుంటారు.
రైతులే దేశానికి వెన్నెముక అని అందరికీ తెలిసిందే. పారిశ్రామికంగా, సాంకేతికంగా ఎంత ఎదిగినా రైతన్న లేనిదే ప్రజల ఉనికే ఉండదు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ సంక్షేమ పథకాలు తర్వాత రైతులకే పెద్దపీట వేస్తాయి. నిధులు, కేటాయింపుల్లో రైతులకు ప్రధాన్యత ఇస్తూ ఉంటాయి. అలాగే పలు రాష్ట్రాలు కూడా రైతుల కోసం ఎన్నో పథకాలను కూడా అందిస్తున్నాయి.
కేంద్రం నుంచి పీఎం కిసాన్ యోజన, ఏపీలో రైతు భరోసా, తెలంగాణలో రైతు బంధు వంటి పథకాలు ఉన్నాయి. ఇప్పుడు మరోరాష్ట్రం రైతుల మేలు కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. రైతులకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నట్లు ప్రకటించింది.
రైతు బాగుంటేనే ఆ దేశం బాగుంటుందని చెబుతుంటారు. అందుకే మన దేశంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వారికోసం అనేక పథకాలను నిర్వహిస్తున్నారు, కొత్త పథకాలను కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా కర్ణాటక ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది.
వడ్డీ రహిత రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రైతులు రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండానే రుణాలు తీసుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. 2023- 2024 బడ్జెట్ లో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న రూ.3 లక్షల స్వల్పకాలిక రుణ పరిమితిని ఇప్పుడు రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు తెలిపింది.
గతంలో ఉన్న రుణపరిమితిని రూ.5 లక్షల వరకు పెంచడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తే రైతులకు వ్యవసాయం కోసం ఎంతో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరిగిన రుణ పరిమితి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. అంటే ఏప్రిల్ 1 నుంచి రైతులు ఈ రుణాలు పొందవచ్చు.
30 లక్షల వరకు రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రూ.25 వేల కోట్ల వరకు రుణాలు మంజూరు చేయచ్చని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు.
Leave a Reply