మిషన్ వాత్సల్య పథకం : తల్లిదండ్రులు లేని పిల్లలు గాని లేదా తల్లి గాని, తండ్రి గాని లేని పిల్లలు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్లకి నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న అటువంటి పథకమే ఈ మిషన్ వాత్సల్య పథకం.
ఈ పథకానికి సంబంధించి అర్హులైన వారు ఎవరైనా ఉంటే వాళ్లు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకు మాత్రమే చివరి తేదీ ఇచ్చారు కానీ ఇప్పుడు దానిని పొడిగించారు ఏప్రిల్ 26వ తేదీ లాస్ట్ తేదీగా పడటం అయితే జరిగింది.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ పొడిగింపు : కానీ మిషన్ వాత్సల్య గడువు పొడిగింపు సర్టిఫికెట్లు పొందేందుకు గడువు కావాలని అభ్యర్థులు కోరిన నేపథ్యంలో గడువును ఈ నెల అనగా ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు ఏపీ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు తెలిపారు.
కాబట్టి అర్హులు ఎవరైనా ఉంటే ఈ మిషన్ వాత్సల్య పథకానికి ఏప్రిల్ 30వ తేదీ లోపల అప్లై చేసుకోవలెను.
ఇంకా ఎవరైనా సర్టిఫికెట్లు తీసుకోవడంలో ఆలస్యమై ఉంటే మీకు 30వ తేదీ వరకు గడువు అయితే ఉంది కావున అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలెను.
For any queries regarding above topic, please tell us through below comment session.