3521 crores and nine fishing harbors : ప్రారంభానికి రెడీ అవుతున్న నెల్లూరు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్
-దీంతోపాటు వేగంగా ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
-మొత్తంగా రూ.3,521 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు
వీటిల్లో 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునే అవకాశం
60,858 మంది మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం
తొలి దశ కింద రూ.1522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్లు నిర్మిస్తున్నారు.
ఇందులో జువ్వలదిన్నె ప్రారంభానికి సిద్ధం అవుతుండగా, నిజాంపట్నంలో 75 శాతం పనులు పూర్తయ్యాయి. మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల పనులు కూడా 40 శాతం పూర్తయ్యాయి.
రెండో దశ కింద రూ.1,997.76 కోట్లతో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యి త్వరలో పనులు ప్రారంభించనున్నారు.
ఈ హార్బర్లన్నీ అందుబాటులోకి వస్తే 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 60,858 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది.
Leave a Reply