No Income Tax: ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం నిర్థేశించిన పరిమితులను దాటి ఆదాయాన్ని పొందేవారు టాక్స్ పరిధిలోకి వస్తారు. వారు వార్షికంగా ఐటీఆర్ ఫైల్ చేసి ప్రతి ఏటా తమ ఆదాయపు పన్ను రిటర్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే.
Sikkim State People Won’t Have To Pay Single Rupee Income Tax No Need Of Pan Card Too
పన్ను పరిమితి పెంపు..
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రకారం ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లతో పాటు పన్ను పరిమితుల్లో మార్పులు కూడా వచ్చాయి. ఇప్పుడు దేశంలో పాత టాక్స్ విధానంతో పాటు కొత్త టాక్స్ విధానం ఏకకాలంలో అమలులో ఉన్నాయి. కొత్త టాక్స్ విధానం కింద రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక పాత పన్ను విధానంలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
టాక్సు లేని రాష్ట్రం..
అందరూ పన్ను ఎలా తగ్గించుకోవాలా అని ఆలోచిస్తుంటే.. దేశంలోని ఒక రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను చెల్లించక్కర్లేదనే వార్త చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవును దేశంలోని ఈశాన్య భాగంలో ఉన్న సిక్కిం ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అందానికి ప్రసిద్ధి చెందిందిన ఈ రాష్ట్ర ప్రజలు పన్ను చెల్లింపు నుంచి మినహాయించబడ్డారు. 95 శాతం మంది ప్రజలు ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్నుగా చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.
కారణం ఏమిటంటే..
సిక్కిం ప్రజలకు ఆదాయపు పన్ను లేకపోవటానికి కారణం ఏమిటంటే.. భారత యూనియన్‌లో రాష్ట్రం విలీన క్రమంలో భారత ప్రభుత్వం అక్కడి ప్రజలకు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు సౌకర్యాన్ని కల్పించింది. ఆర్టికల్ 371A ప్రకారం సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించింది. అందువల్ల ఈ రాష్ట్రంలోని అసలైన నివాసితులు ఆదాయపు పన్ను 1961లోని సెక్షన్ 10 (26AAA) కింద పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతారు.
Leave a Reply