తెలంగాణ రాష్ట్రం ఆయిల్ సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రైతులకులాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహకం అందిస్తుంది. ప్రతి ఎకరానికిసంవత్సరానికి రూ.4200 సబ్సిడీ ఇస్తుంది. మార్చి చివరి నాటికి5వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసే విధంగా చర్యలు మొదలుపెట్టారు.
ఆయిల్ పామ్ సాగు కోసం డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ మంజూరు, పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు ప్రయోజనాలను విస్తృతంగా అవగాహన కల్పించి.. రైతులు ఆయిల్ ఫామ్ సాగును ప్రత్యామ్నాయ పంటగా చూసేలా చేయాలని చెప్తున్నారు. రైతుల అభివృద్ధికిఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకమని, రైతులు ప్రత్యామ్నాయ పంట క్రింద ఆయిల్ పామ్ సాగు చేయాలని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో 2022-23 సంవత్సరానికి 5 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు487 మంది రైతులకు చెందిన 1529 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఆయిల్ పామ్ సాగుతో నాలుగు సంవత్సరాలలో ఆదాయం కోల్పోకుండా అంతర్గత పంటలు వేసి ఆదాయం పొందవచ్చని, ప్రభుత్వం ఎకరానికిరైతు బంధుకు అదనంగా సంవత్సరానికి రూ.4200 సబ్సిడీ అందించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు.
భూపాలపల్లి జిల్లాలో పెండింగ్ లో ఉన్న 3500 ఎకరాలలోమార్చి చివరి నాటికి ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా వ్యవసాయ విస్తరణ అధికారులు లక్ష్యాలు నిర్దేశించుకొని పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మార్చి చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేయాలని, ఇప్పటికే మొక్కలకు డీడీ చెల్లించిన రైతుల నుంచి, డ్రిప్ కోసం సైతం డిడి తీసుకోవాలని, నూతనంగా ముందుకు వచ్చే రైతుల నుంచి డీడీలుసేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు చేసేందుకు వీలుగా సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100%, బీసీ, ఓసి రైతులకు 5 ఎకరాలోపు 90%, 5 ఎకరాలకు పైగా ఉన్నట్లైతే 80% సబ్సిడీ ఉందని, రైతులువారి వాటా 10% కాని,20% కాని జీఎస్టీతో కలిపి డిడి తీయాలని కలెక్టర్ చెప్తున్నారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి పరిధిలో సుమారుగా 1500 ఎకరాలలో గుర్తించిన రైతుల వివరాలను సంబంధిత ఉద్యాన శాఖ అధికారులకు అందించవలసిందిగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికల్లో ఆయిల్ పామ్ సాగు సంబంధించి విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. రైతులకు లాభదాయకమైన పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Leave a Reply