పేదలందరికీ ఇళ్లు (నవరత్నాలు) పథకం :
ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తారు. ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇళ్లు కట్టాలన్నది లక్ష్యం.
ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు. అవసరమైతే ఆ ఇంటి మీద పావలా వడ్డీకే బ్యాంకులో రుణం ఇప్పిస్తారు.
ఈ పథకం వల్ల ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకూ ప్రయోజనం చేకూరుతుంది.
పేదలందరికీ ఇళ్ళు
ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా పక్కా ఇళ్ళు కట్టిస్తాం.
ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ళు కట్టిస్తాం.
ఇళ్ళ స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తాం. వారిపేరునే రిజిష్ట్రేషన్ చేస్తాం, ఇళ్ళు కూడా కట్టిస్తాం.
ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లమ్మల పేరుతో రిజిష్ట్రేషన్.
అంతేకాదు డబ్బు అవసరమైతే అదే ఇంటిమీద పావలా వడ్డీకే రుణం వచ్చేట్టుగా బ్యాంక్ లతో మాట్లాడుతాం.
సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply